Jagan Cheated: ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిరుద్యోగులను మోసం చేశారనే ఆరోపణలు వినబడుతున్నాయి. 2019 ఎన్నికలకు ముందర అనగా అధికారంలోకి రాక మునుపు పాదయాత్ర సమయంలో వైసీపీ అధినేతగా.. జగన్ నిరుద్యోగులకు చాలా హామీలు ఇచ్చారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే 90 వేల ఖాళీ పోస్టులను భర్తీ చేస్తానని అన్నాడు. కానీ, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు పూర్తయినా భర్తీల సంగతి మరిచపోయారనే ఆరోపణలున్నాయి. కేవలం వలంటీర్లు, సచివాలయ ఉద్యోగాల నోటిఫికేషన్లు మాత్రమే ఇచ్చారు.
ఈ క్రమంలోనే రాష్ట్రంలో నిరుద్యోగిత రేటు పెరుగుతోంది. గత ఎలక్షన్స్ సమయానికి రాష్ట్రంలో 8 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నట్లు అంచనాలు ఉండగా, ఇప్పుడు అది డబుల్ అవుతున్నదని పలువురు అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ కాలేజీల్లో లెక్చరర్స్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. డీఎస్సీ పోస్టులు వేసి వాటిని భర్తీ చేయాల్సిన జగన్ సర్కారు ఆ విషయం అస్సలు పట్టించుకోలేదని కొందరు విమర్శిస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు కూడా పెంచారు. ఫలితంగా ఉద్యోగాల భర్తీకి ఇబ్బందులుంటాయని కొందరు పేర్కొంటున్నారు.
నిరుద్యోగులు చాలా మంది జగన్‌పైన ఆశ పెట్టుకున్నారని, వారి ఆశలన్నిటినీ జగన్ అడియాసలు చేస్తున్నారని కొందరు అంటున్నారు. ఏపీలో రాజకీయ అధికారంలో ఉన్న వైసీపీతో నిరుద్యోగులకు మేలు జరగకపోగా కీడు జరుగుతుందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
Also Read: జగన్ దెబ్బ మామూలుగా లేదుగా?
రెండున్నరేళ్లుగా ఏపీ ప్రభుత్వం ఏపీపీఎస్సీ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చింది లేదని నిరుద్యోగులు వాపోతున్నారు. డీఎస్సీ కాని, పోలీసు రిక్రూట్ మెంట్స్ నోటిఫికేషన్ కాని రాలేదు. జూనియర్ కాలేజీల్లో ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులు ఏళ్లుగా ఖాళీగా ఉన్నా వాటిని భర్తీ చేయడం లేదు. ఇప్పుడు పదవీ విరమణ వయసు పెంపు నేపథ్యంలో మరో రెండేళ్ల పాటు నోటిఫికేషన్స్ వచ్చే అవకాశాలు లేవని, ఈ క్రమంలోనే జగన్ నిరుద్యోగులకు ఏం చేశారనే ప్రశ్న తెరమీదకు వస్తున్నది.
రాష్ట్ర నిరుద్యోగ సంఘం నాయకులు ఈ నేపథ్యంలోనే జగన్ సర్కారుపైన పోరుకు సిద్ధమవుతున్నారు. నిరుద్యోగులపై అప్పట్లో వరాలు కురిపించిన జగన్.. ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడుగుతున్నారు. కేవలం ఓట్ల కోసమో ఆనాడు జగన్ హామీలు ఇచ్చారా ? అని కొందరు ప్రశ్నిస్తున్నారు.
Also Read: ఏం మాయ చేశావ్ జగన్.. జీతం కట్ చేసి మరీ ఎలా ఒప్పించావ్.?