https://oktelugu.com/

Jagan Decision: జగన్ నిర్ణయం.. వాట్సాప్ గ్రూపుల నుంచి ఉద్యోగులు నిష్క్రమణ

Jagan Decision: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. ఫిట్ మెంట్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి ఉన్నా రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచి వారిలోని కోపాన్ని తగ్గించారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం చేదు వార్తే అయింది. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం అసంతృప్తి మిగులుతోంది. ప్రొబేషన్ విషయంలో ప్రభుత్వం మరోమారు వాయిదా వేసి వారిని ముప్పతిప్పలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ప్రొబేషనరీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 8, 2022 / 05:32 PM IST
    Follow us on

    Jagan Decision: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. ఉద్యోగుల్లో హర్షం వ్యక్తమైంది. ఫిట్ మెంట్ విషయంలో మాత్రం కొంత అసంతృప్తి ఉన్నా రిటైర్మెంట్ వయసు రెండేళ్లు పెంచి వారిలోని కోపాన్ని తగ్గించారు. కానీ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం చేదు వార్తే అయింది. ఉద్యోగులకు పీఆర్సీ ప్రకటించిన ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు మాత్రం అసంతృప్తి మిగులుతోంది. ప్రొబేషన్ విషయంలో ప్రభుత్వం మరోమారు వాయిదా వేసి వారిని ముప్పతిప్పలు పెట్టాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

    Jagan Decision

    ప్రొబేషనరీ పీరియడ్ మరో నాలుగు నెలలు పెంచుతూ నిర్ణయం తీసుకోవడంతో ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. తమను ఉద్యోగులుగా గుర్తించడం లేదని వాపోతున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు అందకుండా చేసి ప్రభుత్వం ఇచ్చే ప్రోత్సాహకాలు సైతం అందడం లేదు.

    జగనన్న చేయూత, జగనన్న ఆసరా, ఆరోగ్య శ్రీ, వృద్ధాప్య, వితంతు, దివ్యాంగుల పింఛన్లు, జగనన్న అమ్మఒడి, విద్యా దీవెన వంటి పథకాలు అందకుండా పోతున్నాయి. దీంతో అటు ప్రభుత్వం అందించే పథకాలు దక్కకుండా అటు ప్రభుత్వం ఉద్యోగులుగా గుర్తించకుండా చేయడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరుతో తమకు ఏం లాభం లేకుండా పోతోందని చెబుతున్నారు.

    Also Read: నిరుద్యోగులను మోసం చేసిన జగన్..?

    మరోవైపు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ప్రభుత్వ వాట్సాప్ మెసెంజర్ గ్రూపుల నుంచి నిష్క్రమిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తమను ఉద్యోగులుగా గుర్తించడంలో ఎందుకు మీనమేషాలు ఎక్కిస్తుందోనని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పూర్తి స్థాయి ఉద్యోగులుగా గుర్తించడంలో ఎందుకు తాత్సారం చేస్తుందో తెలియడం లేదు. తమను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని కోరుతున్నారు.

    నెలకు రూ.15 వేల వేతనంతో బతుకు కష్టమేనని చెబుతున్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు అందించే డీఏ, హెచ్ ఆర్ఏ వంటి ప్రయోజనాలు సైతం దక్కడం లేదు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ప్రభుత్వ చర్యలతో తమకు ఇక ప్రయోజనాలు శూన్యమేనని తెలుస్తోంది. అందుకే ఉద్యోగులు అఫీషియల్ సోషల్ మీడియా గ్రూపుల నుంచి లెఫ్ట్ అవుతున్నట్లు చెబుతున్నారు.

    Also Read: జగన్ దెబ్బ మామూలుగా లేదుగా?

    Tags