కరోనా సృష్టించిన విలయం అంతా ఇంతా కాదు. వైరస్ ధాటికి ఆర్థిక వ్యవస్థలే కుదేలైపోతున్నాయి. లాక్ డౌన్ పుణ్యమాని విద్యార్థుల చేతిలోకి స్మార్ట్ ఫోన్లు వచ్చాయి. ఆన్ లైన్ తరగతుల పేరుతో వారు చేస్తున్న పనులతో తల్లిదండ్రులు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆన్ లైన్ తరగతుల కోసం వినియోగించాల్సిన ఫోన్లతో అశ్లీల చిత్రాలు చూస్తూ ఆనందిస్తున్నారు.
ఇంటర్ నెట్లో అశ్లీల చిత్రాలు, వీడియోలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. దీంతో వారి పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. రెండేళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండడంతో ఏం చేయాలో పాలుపోని పరిస్థితి. అశ్లీల చిత్రాలు చూసినట్లు నిర్ధారణ అయితే సమాచార సాంకేతిక చట్టం 67బీ ప్రకారం కేసు నమోదు చేసి అరెస్టు చేస్తారు. పిల్లలు అశ్లీల వీడియోలు, దృశ్యాలు చూస్ే గరిష్టంగా ఐదేళ్లు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు.
రెండోసారి అలాగే పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా విధిస్తారు. పెద్దలు అశ్లీల చిత్రాలు చూస్తే మూడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా, రెండోసారి పట్టుబడితే ఏడేళ్ల జైలు, రూ.10 లక్షల జరిమానా కట్టాల్సి ఉంటుంది. లాక్ డౌన్ సమయంల పిల్లలు మాత్రమే కాకుండా పెద్దలు కూడా పోర్న్ వీడియోలు ఎక్కువగా చూస్తున్నారు.
గత కొన్ని నెలల్లో పోర్న్ వీడియోలను చూసిన వారిని సీఐడీ గుర్తిస్తోంది. రాష్ర్ట వ్యాప్తంగా సుమారు 200 మందిని ఇటీవల అధికారులు విచారించారు. ఏ మొబైల్ నుంచి చూసినా ఆ మొబైల్ యజమానిని అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయి. 18 ఏళ్ల లోపు వారు చూస్తే తల్లిదండ్రులను అరెస్టు చేస్తారు. దీంతో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సీఐడీ అధికారులు సూచిస్తున్నారు.