Petrol prices: ఇన్నాళ్లు కేంద్రాన్ని ఆడిపోసుకున్న స్టేట్లకు ఇప్పుడు కొత్త చిక్కు వచ్చి పడింది. కేంద్రం పెట్రోధరలు తగ్గించడంతో బీజేపీ పాలిత స్టేట్లు కూడా వ్యాట్ తగ్గించి కేంద్రానికి సహకరించాయి. దీంతో ఆ ప్రాంతాల్లో పెట్రో ధరలు తగ్గాయి. ఇప్పుడు కేంద్రం స్టేట్లకు చురకలు వేస్తోంది. ఇన్నాళ్లు తమను ఆడిపోసుకున్న ప్రాంతాలు ఇప్పుడు ఎందుకు ధరలు తగ్గించడం లేదని విమర్శలు చేస్తున్నాయి.
హుజురాబాద్ ఉప ఎన్నికలో రాష్ర్ట ఆర్థిక మంత్రి హరీశ్ రావు కేంద్రంపై అవాకులు చెవాకులు పేలారు. ఇప్పుడు ఎందుకు మాట్లాడటం లేదు. కేంద్రం తన మాట నిలబెట్టుకుని పెట్రోధరలు తగ్గించినా ఇంతవరకు తెలంగాణ స్పందించకపోవడం గమనార్హం. ఎప్పుడైనా ఇతరుల మీద బురద వేస్తే అది మనమీ దే పడుతుందని గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు. బీజేపీ నేతలు సీఎంల తీరుపై బహిరంగంగానే విమర్శలకు దిగుతున్నారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం పెట్రోల్ పై రూ.35.20 శాతం వ్యాట్ వసూలు చేస్తోంది. ఏపీ కూడా 31 శాతం వ్యాట్ తో పాటు ఇంకా అదనంగా నాలుగు రూపాయలు వసూలు చేస్తోంది. దీంతో ఏపీకి తెలంగాణకు మధ్య మూడు రూపాయల తేడా ఉంటుంది. దీంతో కేంద్రం పెట్రో ధరలు తగ్గించడంతో తెలుగు సీఎం లు మాత్రం పెదవి విప్పడం లేదు. ఒకవేళ ధర తగ్గిస్తే భారం మోయాల్సి వస్తోందని గమ్మున ఉంటున్నట్లు బీజేపీ నేతలు చెబుతున్నారు.
ప్రస్తుతం ఏ ఎన్నికలు లేనందున పార్టీలు పెట్రో ధరలపై ఏం మాట్లాడటం లేదు. కానీ బీజేపీపై మాత్రం నిందలు వేస్తే ఊరుకునేది లేదని తెగేసి చెబుతున్నారు. స్టేట్ల తీరుతో ప్రజలు బాధలు పడుతున్నారని తెలుస్తోంది. పెట్రో ధరలపై ఇప్పటికైనా నిర్ణయం తీసుకుని ధర తగ్గించేందుకు ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలుస్తోంది.
Also Read: Telangana Govt: తెలంగాణలో మద్యం దుకాణాల పెంపు.. ఇరకాటంలో సర్కార్