Vijay Devarakonda: పెళ్లి చూపులు చిత్రంతో తెలుగు తెరకు హీరోగా ఎంట్రీ ఇచ్చాడు విజయ్ దేవరకొండ. అంతకు ముందు పలు సినిమాల్లో పలు క్యారెక్టర్ లలో కనిపించిన అవి విజయ్ కి అంత గుర్తింపును తీస్య్కు రాలేదనే చెప్పాలి. అయితే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో వచ్చిన “అర్జున్ రెడ్డి” సినిమాతో యూత్ లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నాడు అని చెప్పాలి. ప్రస్తుతం విజయ్, పురి జగన్నాధ్ దర్శకత్వంలో పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ‘లైగర్’ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నాడు. కాగా మరో పక్క దామోదర దర్శకత్వంలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కిత్రమ్ ”పుష్పక విమానం”. ఆనంద్ కి జోడిగా సాన్వి మేఘన నటించారు. ఈ చిత్రానికి విజయ్ దేవరకొండ నిర్మాతగా వ్యవహించారు.

ఈ సినిమా మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా ఈ మేరకు సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా విజయ్ దేవరకొండ, తన తమ్ముడు ఆనంద్ దేవరకొండతో కలిసి గూగుల్ లో సర్చ్ చేసిన పలు ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు. అందులో విజయ్ దేవరకొండ సింగిలా అన్న ప్రశ్నకు విజయ్ షాకింగ్ ఆన్సర్ ఇచ్చాడు. ఇటీవలే నాకు బ్రేకప్ అయ్యింది. ఈ విషయం ఎవరికి చెప్పలేదు, కొంచెం బాధలో ఉన్నా అని చెప్పుకొచ్చాడు. దీంతో ఈ సమాధానం విన్న విజయ్ అభిమానులందరూ ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. విజయ్ నిజంగా చెప్పాడా, లేక సరదాగా చెప్పాడా అనే విషయంపై ఇంకా క్లారీతి రావాల్సి ఉంది. ఒక వేళ నిజంగా బ్రేకప్ అయితే ఆ అమ్మాయి ఎవరా అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతుంది.