Mahesh babu: సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఏ సినిమాలో సంగీత దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు అనే విషయాలు మాత్రమే తెలియజేస్తారు.అయితే ఇటీవలే ట్విట్టర్ లో తన ఫేవరెట్ హీరోస్ గురించి తాజా అప్డేట్ ను అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకుంటున్నారు మ్యూజిక్ డైరెక్టర్ తమన్. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం
సర్కారు వారి పాట’. మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాకి మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ జి. మహేష్‌బాబు ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మాణం సంస్థలు నిర్మిస్తున్నాయి. ఈ మూవీకి సంగీత దర్శకుడు గా ఎం ఎస్ తమన్ స్వరాలను అందిస్తున్నారు.
బ్యాంకింగ్ రంగంలో జరుగుతున్న స్కామ్ , భారీ కుంభకోణం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిస్తున్నారు ఇప్పటికే విడుదల చేసిన పోస్టర్ లో సూపర్ స్టార్ స్టైలిష్ లుక్ లో ప్రేక్షకులను అలరించారు…. . ఈ క్రమంలోనే తమన్ చేసిన తాజా ట్వీట్ అభిమానులలో భారీ ఎక్స్పెక్టేషన్స్ పెంచుతోంది. ‘సర్కారు వారి పాట’ మూవీ ఆల్బమ్ నా హృదయానికి చాలా దగ్గరైనది. దీనికోసం ఏ రోజు అసలు తగ్గకుండా వర్క్ చేస్తానని, అయితే ఈ సినిమా కి సంబంధించిన రిలీజ్ డేట్ అప్‌డేట్స్ కూడా ఉంటాయని తెలిపారు. అంతే కాకుండా మన సూపర్ స్టార్ కోసం చేస్తున్న ఈ ఆల్బమ్ చాలా స్పెషల్‌గా ఉంటుందని థమన్ ట్వీట్‌లో వెల్లడించారు.