Summer Special Trains: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వరుడు. ఆయన కొలువుదీరిన నెలవు తిరుపతి. దీంతో వడ్డీకాసుల వాడిని దర్శించుకునేందుకు దేశం లోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు. తమ ఇష్ట దైవాన్ని దర్శించుకుని తరిస్తుంటారు. జీవితంలో ఒక్కసారైనా తిరుపతిని చూడాలని భక్తులు భావిస్తుంటారు. ఇందుకోసమే ప్రణాళికలు రచించుకుని మరీ పర్యటనకు శ్రీకారం చుడతారు. మొక్కులు చెల్లించుకుని తరిస్తారు. ముందస్తుగానే రైల్వే టికెట్లు బుక్ చేసుకుని యాత్రకు తయారవుతుంటారు.

దేశంలోని అన్ని రాష్ట్రాల నుంచి భక్తుల తిరుపతి రావడం సహజమే. వారి కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్ల నడిపేందుకు సిద్ధమవుతోంది. వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రత్యేక రైళ్లు నడిపి ఆదాయం సమకూర్చుకునేందుకు రెడీ అవుతోంది. దీనికి గాను తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల మీదుగా తిరుపతికి రైళ్లు నడపాలని ప్లాన్ చేస్తోంది. ఉన్న రైళ్లకు ఇంకా కొన్ని జోడించి ప్రయాణికుల సంఖ్యకు అనుగుణంగా రైళ్లను కేటాయిస్తోంది.
ఈమేరకు సికింద్రాబాద్ స్టేషన్ నుంచి నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణికుంట మీదుగా తిరుపతికి వెళ్లేందుకు రైలును ప్రత్యేకంగా కేటాయించింది. దీంతో వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీ దృష్ట్యా రైల్వేశాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. అదనంగా రైళ్లను నడుపుతూ ఆదాయం సమకూర్చుకోవాలని చూస్తోంది. దీనికి అనుగుణంగా ఏర్పాట్లు చేస్తోంది.

కర్ణాటకలోని బీజాపూర్ తిరుపతి మధ్య రెండు ప్రత్యేక రైళ్లు నడిపేందుకు దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. దీంతో కర్ణాటక నుంచి వచ్చే భక్తులకు సౌకర్యం కలగనుంది. ఈ మేరకు రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయంతో వేసవిలో రైల్వేకు ప్రత్యేక ఆదాయం సమకూరనుంది. దీని కోసమే చర్యలు తీసుకుందని తెలుస్తోంది. భక్తుల కోరిక మేరకే రైళ్ల సంఖ్య పెంచుతున్నట్లు చెబుతున్నారు.
[…] […]