
ప్రార్థించే పెదవులకన్నా సాయం చేసే చేతులే మిన్న అన్నారు. సినీ నటుడు సోనూసూద్ తనదైన శైలిలో సాయం చేస్తూ తనలోని దాతృత్వాన్ని చాటుతున్నాడు. మనిషిలో సైతం దైవత్వం దాగి ఉందని నిరూపిస్తున్నాడు. ఆయన చర్యలకు దేశం మొత్తం ఫిదా అయిపోతోంది. కోట్ల మంది మనసులు గెలుచుకున్న సోనూసూద్ మరో అడుగు ముందుకేశాడు. కరోనా కష్టకాలంలో ప్రజల ఇబ్బందులు గుర్తించిన ఆయన వారి సేవలో తరించారు.
వారి కోసం సిలిండర్లు అందజేశారు. ప్రస్తుతం వాయనాడ్ లో విద్యార్థుల సౌకర్యార్థం ఓ సెల్ టవర్ నిర్మాణానికి నడుం బిగించాడు. ట్రైబల్ ప్రాంతాల్లోసిగ్నల్ లేని కారణంగా విద్యార్థులు ఆన్ లైన్ తరగతులు వినలేకపోతున్న నేపథ్యంలో వారి కోసం సెల్ టవర్ ఏర్పాటుకు సిద్ధమయ్యాడు. సిగ్నల్ సమస్య సోనూసూద్ దృష్టికి చేరడంతో టవర్ నిర్మాణ పనులు చేపట్టాడు. చదువును నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయం తీసుకోవడంతో టవర్ నిర్మాణం చేపడతున్నట్లు పేర్కొన్నాడు.
సోనూసూద్ లోని గుణాన్ని అందరు ప్రశంసిస్తున్నారు. కరోనా విపత్తు కాలంలో ఎవరు కూడా చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో సెల్ టవర్ ఏర్పాటుకు పూనుకోవడం నిజంగా గొప్ప విషయమే. ఆయన మంచి మనసుకు అందరు ఫిదా అవుతున్నారు. పది మందికి సాయం చేసే వారుంటే వారు పది కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు.
కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో సెల్ టవర్ ఏర్పాటుకు చర్యలు మొదలు పెట్టారు. తక్షణమే పనులు చేపట్టాలని ఫౌండేషన్ సభ్యులకు తెలిపారు. దీంతో అప్పుడే అక్కడ పనులు చకచకా సాగిపోతున్నాయి. త్వరలో సెల్ టవర్ ఏర్పాటు అయితే విద్యార్థుల సమస్యలు తీరుతాయి. సిగ్నల్ సమస్య పోతే ఆన్ లైన్ తరగతులు కొనసాగించవచ్చని విద్యార్థుల్లో సంబరాలు నెలకొన్నాయి.