జాతీయ వార్తలువిమానాల్లో మధ్య సీట్లపై సుప్రీం క్లారిటీ!

విమానాల్లో మధ్య సీట్లపై సుప్రీం క్లారిటీ!

 

వందేభారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానాలు పంపించి విదేశాలలో ఉన్న భారతీయులను రప్పించడంలో భౌతిక దూరం పై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. భౌతిక దూరం నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఇది విమానం కాబట్టి వేరే వ్యక్తికి సోకకూడదని వైరస్‌ కి ఏమైనా తెలుస్తుందా..? అని వ్యంగ్యాస్త్రం సంధించింది. జూన్ ఆరు తర్వాత మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. లాభాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వీసులు నడిపించాలని ఎయిరిండియాకి సూచించింది.

మిడిల్ సీట్ల బుకింగ్‌ పై గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎయిర్ ఇండియా సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడా ఎయిర్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ముంబై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎయిర్ ఇండియా పిటిషన్ కొట్టివేసింది. కరోనా వైరస్ కట్టడి కోసం భౌతిక దూరం పాటించడం ఇంగిత జ్ఞానం అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే వచ్చే పది రోజులు మాత్రం మద్య సీట్లను కూడా నింపి కార్యకలాపాలు జరుపుకోవచ్చని సుప్రింకోర్టు తెలిపింది. ఎయిర్ ఇండియాకు ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఉద్దేశించి మాత్రమే సుప్రీం ఈ వాఖ్యలు చేసింది. సీట్లను ఖాళీగా ఉంచడం కంటే, పరీక్షలు చేయడం, క్వారంటైన్ లో ఉంచడమే మంచి విధానమని, జూన్ 16 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని ఎయిరిండియా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Air India Passengers Fight: అరేయ్ ఏంట్రా ఇదీ.. విమానంలోనూ ఈ పనులేంటి? పరువుతీస్తున్నారు

Air India Passengers Fight: సాధారణంగా ఆర్టీసీ బస్సులు, రైళ్లలో సీట్ల కోసం.. సౌకర్యాల కోసం ప్రయాణికులు కొట్టుకోవడం చూస్తుంటాం.. ఈ మధ్యన తెలుగు రాష్ట్రాల్లో ఉచిత బస్సుల దయ వల్ల వీడియోలు...

Air India in Crisis: టాటా పరువు తీస్తున్న టాప్ కంపెనీ.. రెండ్రోజుల్లో రెండు ప్రమాదాలు

 Air India in Crisis: టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసినప్పుడు అందరూ ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ పాత ఎయిర్‌లైన్‌కు టాటా మంచి మెయింటెనెన్స్, వనరులతో కొత్త జీవం...

Most Popular

Delhi Protests: అటు కాక్రోచ్ లు.. ఇటు రైతులు.. మోడీకి ఏంటీ తలనొప్పులు

Delhi Protests: ఢిల్లీ నగరం ఆందోళనలతో అట్టుడికి పోతుంది. గతంలో కేంద్రం వ్యవసాయ చట్టాలను తీసుకువచ్చింది. అప్పుడు హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు సంబంధించిన కొంతమంది రైతులు అందులో పాల్గొన్నారు. ఇదే అదునుగా ఖలీస్థానీ...

ISI Agents In India: అమాయక హిందువులే పాకిస్తాన్ ఐఎస్ఐ టార్గెట్.. ఎంతటి దుర్మార్గానికి పాల్పడిందంటే..

ISI Agents In India: సరిహద్దుల్లో మారణ హోమం సృష్టిస్తూ ఉంటుంది. మన సైనికులపై దాడులకు పాల్పడుతూ ఉంటుంది. ప్రశాంతమైన మనదేశంలో అల్లకల్లోలం సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. నకిలీ నగదు.....

13-year-old boy : కమీషన్ ఇస్తేనే పనిచేస్తారా.. 13 ఏళ్ల బాలుడి ప్రశ్నకు కలెక్టర్ కు నోటి మాట...

13-year-old boy : అది కలెక్టర్ కార్యాలయం.. కలెక్టర్.. ఇతర అధికారులు ప్రజల సమస్యలు వింటున్నారు. ప్రజలు కూడా తమ సమస్యలను చెప్పుకోవడానికి అక్కడికి వచ్చారు. వారంతా కూడా తమ సమస్యల మీద...

NITI Aayog Rankings : కాలం చెల్లిన గణాంకాలతో నీతి ఆయోగ్ ర్యాంకులు

NITI Aayog Rankings : కేంద్ర ప్రభుత్వ విధాన నిర్ణాయక సంస్థ 'నీతి ఆయోగ్' (NITI Aayog) రాష్ట్రాల ప్రగతిని అంచనా వేసేందుకు విడుదల చేసే నివేదికలు ఎల్లప్పుడూ చర్చనీయాంశంగా మారుతుంటాయి. తాజాగా...

Cockroach Janata Party : చొచ్చుకొచ్చిన బొద్దింకలు.. దిగొస్తున్న బీజేపీ సర్కార్.. ఢిల్లీలో నాటకీయ పరిణామాలు

Cockroach Janata Party : దేశ రాజధాని ఢిల్లీలో పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాల సందర్భంగా ఢిల్లీ నగరంలో పోలీసులు సహజంగానే ఆంక్షలు విధిస్తూ ఉంటారు. అయితే ఈసారి ఆ...
Exit mobile version