నందిని రాయ్ తెలుగులో చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ తనకుంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ బ్యూటీ తెలుగులో ‘మెసగాళ్లకు మెసగాడు’, ‘సిల్లీ ఫెలోస్’, ‘మాయ’ తదితర చిత్రాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. అయితే ఈ భామకు అనుకున్నంత స్టార్డమ్ మాత్రం రాలేదు. సరైన అవకాశాలకు కోసం ఎదరుచూస్తున్న ఈ బ్యూటీకి ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో ఆఫర్ వచ్చింది. నందినిరాయ్ ఈ షోలో పాల్గొని తన టాలెంట్ తో మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. సినిమాల కంటే బిగ్ బాస్ ద్వారానే ఈ అమ్మడికి మరింత క్రేజ్ వచ్చింది. తాజాగా నందిని రాయ్ సోషల్ మీడియాలో అభిమానులతో చిట్ చాట్ చేసింది. ఈ సందర్భంగా నెటిజన్లు అగిడిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చింది. ఇందులో క్యాస్టింగ్ కౌచ్ పై నందిని రాయ్ చెప్పిన సమాధానం అందరినీ ఆలోచించేలా చేస్తోంది.
క్యాస్టింగ్ కౌచ్ అనేది ఒక్క సినిమా ఇండస్ట్రీకే పరిమితం కాలేదని అంటోంది. ఇది అన్నిరంగంల్లోనూ ఉందని దీనికి చిత్రపరిశ్రమ మినహాయింపు కాదని చెబుతోంది. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో మిగతా ఇండస్ట్రీలతో పొలిస్తే ఒకరకంగా చిత్రసీమనే బెటరని అంటోంది. తనకు సినిమా పరిశ్రమలో అలాంటి అనుభవాలు ఎదురు కాలేదని చెబుతోంది. అయితే తన ఫ్రెండ్స్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్నారని వారి చెప్పే కొన్ని విషయాలు వింటుంటే ఒకరకంగా సినిమా ఇండస్ట్రీనే బెటర్ అనే ఫీలింగ్ కలుగుతుందని చెప్పింది. అంతేకాదు అమ్మాయిలైనా.. హీరోయిన్లు అయినా ‘నో’ అని చెబితే ఎవరూ ఏం చేయలేరని.. ‘నో’ అన్నాక బలవంతం చేసే పరిస్థితులు ఉండవని చెబుతోంది. ఇదంతా అమ్మాయిలు వ్యవహరించే తీరుపై ఆధారపడి ఉంటుందని నందినిరాయ్ అంటోంది.
దీనిపై నెటిజన్ల నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి. క్యాస్టింగ్ కౌచ్ విషయంలో అమ్మాయిలే తప్పు అన్నట్లు నందినిరాయ్ మాట్లాడటం తగదని పలువురు విమర్శలు చేస్తున్నారు. క్యాస్టింగ్ కౌచ్ విషయం సినిమా ఇండస్ట్రీని వెనుకేసు రావడం వెనుక నందిని రాయ్ అంతర్యం ఏంటో తెలియడం లేదు. సినిమాల్లో అవకాశాల కోసమే నందినిరాయ్ ఇలా మాట్లాడుతుందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ రకంగా ఈ అమ్మడికి సినిమా ఆఫర్లు దక్కుతాయో లేదో వేచి చూడాల్సిందే..!