https://oktelugu.com/

విమానాల్లో మధ్య సీట్లపై సుప్రీం క్లారిటీ!

  వందేభారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానాలు పంపించి విదేశాలలో ఉన్న భారతీయులను రప్పించడంలో భౌతిక దూరం పై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. భౌతిక దూరం నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఇది విమానం కాబట్టి వేరే వ్యక్తికి సోకకూడదని వైరస్‌ కి ఏమైనా తెలుస్తుందా..? అని వ్యంగ్యాస్త్రం సంధించింది. జూన్ ఆరు తర్వాత మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. లాభాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వీసులు నడిపించాలని […]

Written By:
  • Neelambaram
  • , Updated On : May 25, 2020 / 05:57 PM IST
    Follow us on

     

    వందేభారత్ మిషన్ లో భాగంగా ప్రత్యేక విమానాలు పంపించి విదేశాలలో ఉన్న భారతీయులను రప్పించడంలో భౌతిక దూరం పై సుప్రీంకోర్టు క్లారిటీ ఇచ్చింది. భౌతిక దూరం నిబంధనలను కేంద్రం ఉల్లంఘిస్తోందని మండిపడింది. ఇది విమానం కాబట్టి వేరే వ్యక్తికి సోకకూడదని వైరస్‌ కి ఏమైనా తెలుస్తుందా..? అని వ్యంగ్యాస్త్రం సంధించింది. జూన్ ఆరు తర్వాత మిడిల్ సీట్లను ఖాళీగా ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. లాభాల కోసం కాకుండా ప్రజాప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని సర్వీసులు నడిపించాలని ఎయిరిండియాకి సూచించింది.

    మిడిల్ సీట్ల బుకింగ్‌ పై గతంలో ముంబై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఎయిర్ ఇండియా సుప్రీం కోర్టుకు వెళ్లింది. అక్కడా ఎయిర్ ఇండియాకు ఎదురు దెబ్బ తగిలింది. ముంబై న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సమర్థిస్తూ ఎయిర్ ఇండియా పిటిషన్ కొట్టివేసింది. కరోనా వైరస్ కట్టడి కోసం భౌతిక దూరం పాటించడం ఇంగిత జ్ఞానం అని కోర్టు వ్యాఖ్యానించింది. అయితే వచ్చే పది రోజులు మాత్రం మద్య సీట్లను కూడా నింపి కార్యకలాపాలు జరుపుకోవచ్చని సుప్రింకోర్టు తెలిపింది. ఎయిర్ ఇండియాకు ఈ మేరకు వెసులుబాటు కల్పించింది. అంతర్జాతీయ విమాన ప్రయాణాలను ఉద్దేశించి మాత్రమే సుప్రీం ఈ వాఖ్యలు చేసింది. సీట్లను ఖాళీగా ఉంచడం కంటే, పరీక్షలు చేయడం, క్వారంటైన్ లో ఉంచడమే మంచి విధానమని, జూన్ 16 వరకు బుకింగ్స్ పూర్తయ్యాయని ఎయిరిండియా, ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు తెలిపారు.