Air India in Crisis: టాటా గ్రూప్ ఎయిర్ ఇండియాను కొనుగోలు చేసినప్పుడు అందరూ ఎంతో ఆశతో ఎదురు చూశారు. ఈ పాత ఎయిర్‌లైన్‌కు టాటా మంచి మెయింటెనెన్స్, వనరులతో కొత్త జీవం పోస్తుందని అంతా భావించారు. కానీ ఇటీవల కాలంలో వరుస టెక్నికల్ లోపాలు, సేఫ్టీకి సంబంధిత ఘటనలు ఎయిర్ ఇండియా విశ్వసనీయతను దెబ్బతీస్తున్నాయి. అంతేకాదు కొన్ని ఏళ్ల కష్టం మీద టాటా సంపాదించుకున్న మంచి పేరుకు కూడా ఇది పెద్ద దెబ్బ తగిలిస్తోంది. తాజాగా ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఎయిర్ ఇండియా విమానం ఆక్సిలరీ పవర్ యూనిట్లో మంటలు చెలరేగడం కలకలం రేపింది. ఈ ఘటనలో ప్రయాణికులు, సిబ్బంది సురక్షితంగా బయటపడినా, ఇది ఎయిర్ ఇండియాలో పెరుగుతున్న సమస్యలను మరింత తీవ్రతరం చేస్తోంది.
Also Read: పాక్ కు షాక్.. భారత్ కు మద్దతుగా చైనా.. కీలక పరిణామం
తాజాగా, మంగళవారం ఢిల్లీ ఎయిర్ పోర్టులో ఒక సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. హాంకాంగ్ నుంచి వచ్చిన ఎయిర్ ఇండియా ఎయిర్‌బస్ A321 (TV-TVG) విమానం ఆక్సిలరీ పవర్ యూనిట్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఏపీయూ అనేది చిన్న భాగం కాదు. ఇది విమానం భూమిపై ఉన్నప్పుడు విద్యుత్, ఎయిర్ కండిషనింగ్‌ను అందించే ఒక చిన్న జెట్ ఇంజిన్. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది అందరూ సురక్షితంగా బయటపడ్డారు. అయితే, విమానానికి భారీ నష్టం జరిగిందని, దాన్ని చెకింగ్స్ కోసం నిలిపివేశారని తెలిసింది. ఈ ఘటన ఫ్లైట్ మెయింటెనెన్స్ లో పెద్ద లోపాన్ని సూచిస్తుందని నిపుణులు అంటున్నారు. ఇంత పెద్ద పొరపాటు ఎలా జరిగిందనే ప్రశ్న ఇప్పుడు అందరి మనసుల్లో మెదులుతోంది.
ఢిల్లీ ఘటన ఒక్కటే కాదు. సరిగ్గా ఒక రోజు ముందు, సోమవారం ముంబైలో ఎయిర్ ఇండియాకు చెందిన ఒక విమానం ల్యాండింగ్ సమయంలో రన్‌వే నుంచి పక్కకు జారింది. ఈ ఘటనలో విమానం మూడు టైర్లు పగిలిపోయాయి. ఇంజిన్‌కు కూడా నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదం విమానం ఆపరేషన్, సేఫ్టీ ప్రమాణాలపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఇలాంటి వరుస ఘటనలు ప్రయాణికులలో భయాన్ని కలగజేస్తున్నాయి. ఎయిర్ ఇండియా విమానాలు అంత సేఫ్ కాదన్న అభిప్రాయం ఇప్పుడు ప్రతి విమాన ప్రయాణికుడి మదిలో మెదులుతోంది.
గత ఆరు నెలల్లో ఎయిర్ ఇండియా సమస్యలు మరింత పెరిగాయి. ఈ కాలంలో ఎయిర్‌లైన్‌కు తొమ్మిది సార్లు నోటీసులు జారీ చేసినట్లు ప్రభుత్వం వెల్లడించింది. భద్రతా నియమాలను ఉల్లంఘించడం, ప్రయాణికుల ఫిర్యాదుల కారణంగా ఈ నోటీసులు ఇచ్చారు. ఇది ఏజెన్సీలు కూడా ఎయిర్ ఇండియా పనితీరు పట్ల సంతృప్తిగా లేవని స్పష్టం చేస్తోంది. కొన్నిసార్లు విమానాలు డిలే కావడం, కొన్నిసార్లు సర్వీస్ సరిగా లేకపోవడం, మరికొన్నిసార్లు సాంకేతిక సమస్యలు. ఇవన్నీ కలిసి ఎయిర్ ఇండియా విశ్వసనీయతను మరింత బలహీనపరుస్తున్నాయి.
Also Read: తప్పించారా.. తప్పుకున్నారా.. ఉపరాష్ట్రపతి రాజీనామా వెనుక ఏం జరిగింది?
టాటా గ్రూప్ పేరు భారతదేశంలో నమ్మకానికి మారుపేరుగా ఉంది. టాటా మోటార్స్ వాహనాలైనా, టాటా స్టీల్ ఉత్పత్తులైనా, లేదా టీసీఎస్ టెక్నాలజీ అయినా, అన్ని రంగాల్లో టాటా తనకంటూ ఒక మంచి పేరును సంపాదించుకుంది. ఎయిర్ ఇండియాను కొనుగోలు చేయడం వెనుక ఉద్దేశ్యం కూడా టాటా నిర్వహణ, వనరుల బలంతో ఈ ఎయిర్‌లైన్ మళ్లీ కొత్త జీవం పోయాలనేదే. కానీ, ఇలాంటి వరుస ప్రమాదాలు ఈ ఆశలను దెబ్బతీస్తున్నాయి. ఒక ఎయిర్‌లైన్‌లో ఇలాంటి ఘటనలు పదేపదే జరిగినప్పుడు ప్రయాణికుల నమ్మకం సన్నగిల్లుతుంది. ఎయిర్ ఇండియా ఈ విషయంలో కనుక విఫలమైతే, ప్రయాణికులు ఇతర ఎయిర్‌లైన్స్‌ల వైపు మొగ్గు చూపుతారు. దీని ప్రభావం ఎయిర్ ఇండియా వ్యాపారంపై మాత్రమే కాకుండా, మొత్తం టాటా గ్రూప్ బ్రాండ్ ఇమేజ్‌కు కూడా నష్టం కలిగించవచ్చు.