https://oktelugu.com/

కేంద్రంలో బీజేపీ ఉండాలా.. ఏపీలో వైసీపీ ఉండాలా..!: ఇదే ఆ రెండు పార్టీల ఫ్రెండ్‌షిప్‌

ఏపీలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు వర్సెస్‌ వైసీపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు.. నాలుగు జాతీయ పార్టీలు నడుస్తున్నాయి. జనసేన మాత్రం ఏ స్టంట్‌లో వెళ్తోందో ఆ పార్టీకే అర్థం కాకుండా ఉంది. కాంగ్రెస్‌, వామపక్షాలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఇక బీజేపీ మాత్రం రాష్ట్రంలో తన ప్రాభవం చాటాలని చూస్తోంది. అందుకే హడావుడి చేస్తోంది. ఏపీ రాజకీయ చరిత్రనే తిరగరాస్తానంటోంది. Also Read: జేసీ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2021 / 10:39 AM IST
    Follow us on


    ఏపీలో రాజకీయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. టీడీపీ, బీజేపీ, కాంగ్రెస్‌, వామపక్షాలు వర్సెస్‌ వైసీపీ అన్నట్లుగా రాజకీయాలు నడుస్తున్నాయి. ఏపీలో ప్రస్తుతం మూడు ప్రాంతీయ పార్టీలు.. నాలుగు జాతీయ పార్టీలు నడుస్తున్నాయి. జనసేన మాత్రం ఏ స్టంట్‌లో వెళ్తోందో ఆ పార్టీకే అర్థం కాకుండా ఉంది. కాంగ్రెస్‌, వామపక్షాలు ఉనికి కోసం పోరాడుతున్నాయి. ఇక బీజేపీ మాత్రం రాష్ట్రంలో తన ప్రాభవం చాటాలని చూస్తోంది. అందుకే హడావుడి చేస్తోంది. ఏపీ రాజకీయ చరిత్రనే తిరగరాస్తానంటోంది.

    Also Read: జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..!

    ఏపీలో బీజేపీ ఇప్పటికే చాలాసార్లు టీడీపీతో పొత్తు పెట్టుకుంది. అధికారాన్ని రెండు పార్టీలు పంచుకున్నాయి. ఆ తర్వాత విడిపోయాయి. అయితే.. బీజేపీకి ఇప్పుడు ఆశలు పెరిగాయి. పైగా టీడీపీ మీద ముఖం చాటేసింది. ఆ పార్టీ అధినేత చంద్రబాబు విశ్వసనీయత మీద నమ్మకం కూడా చెదిరింది. అందుకే కొత్త దారులు వెతుకుతోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ టీడీపీతో పొత్తులు పెట్టుకోరాదని మోడీ అమిత్ షా లెవెల్లోనే చెప్పింది రాష్ట్ర శాఖ. చంద్రబాబు ఏంటో బాగా తెలిసిపోయిన వేళ ఆయన్ని చేరదీయడం అన్నది కుదిరే వ్యవహారం కాదని కూడా అంటున్నారు.

    Also Read: కృష్ణా బోర్డుపై జగన్‌ యూటర్న్‌..: విశాఖలో పెట్టాలంటూ కేంద్రానికి లేఖ

    ఇక ఏపీలో మరో బలమైన ప్రాంతీయ పార్టీగా ఉన్న వైసీపీలో బీజేపీ రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్న దాని మీద అయితే ఇప్పటికీ ఎవరికీ క్లారిటీ లేదు. కానీ.. మోడీ, అమిత్ షా జగన్ లెవెల్లో మాత్రం బ్రహ్మాండమైన అవగాహన ఉందని అంటున్నారు. ఏపీ వరకూ జగన్ ని నమ్మకమైన మిత్రుడిగా మోడీ షాలు చూస్తున్నారని తెలుస్తోంది. 2024 కానీ అంతకు ముందు కానీ ఎన్నికలు జరిగితే ఒకవేళ బీజేపీకి కేంద్రంలో అధికారానికి సీట్లు తగ్గినా ఏపీ వరకూ జగన్ కొమ్ము కాస్తాడు అని చాలా బలమైన నమ్మకం మాత్రం బీజేపీ పెద్దలు ఇద్దరికీ ఉందని అంటున్నారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    అందుకే.. ఏపీ బీజేపీ నాయకులు ఎంతగా జగన్ మీద విమర్శలు చేసినా జగన్ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. ఎందుకంటే ఏదైనా జగన్‌ హైకమాండ్‌తోనే కదా. ఇక ఏపీలో పోలవరం ప్రాజెక్ట్‌కు సవరించిన నిధులను పూర్తిగా భరించేందుకు కేంద్రం ముందుకు రావడం అంటే ఏపీలో తాము జగన్ పక్షంగా ఉన్నట్లు బలమైన సంకేతమే ఇక. అలాగే జగన్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన రాయలసీమ ఎత్తి పోతల పథకానికి కేంద్ర జల సంఘం క్లియరెన్స్ ఇవ్వడమూ వైసీపీతో దోస్తీలో భాగనే అంటున్నారు. అందువల్ల జగన్ ఏపీలో ఉండాలి. ఢిల్లీ కోటలో బీజేపీ ఉండాలి అనేదే ఒప్పందంలా అనిపిస్తోంది. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఏపీలో బీజేపీ–వైసీపీల మధ్య ఫ్రెండ్లీ మ్యాచ్ గానే కథ సాగే పరిస్థితులే ఉన్నాయి.