జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష.. తాడిపత్రిలో టెన్షన్.. టెన్షన్..!

ఓటమి ఎరుగని రికార్డు వారిది. వయసు మీద పడుతోంది.. ఇక రెస్ట్‌ తీసుకోవాలని అనుకున్నారు. కానీ.. ఎందుకో వారికి ఆ మాట అస్సలు కలిసిరావడం లేదు. వాళ్లే జేసీ బ్రదర్స్‌. ఓటమి ఎరుగకుండా తమ రికార్డును తామే కాపాడుకున్నా.. వారి వారసుల విషయంలో మాత్రం ఫెయిల్యూర్స్‌ చూశారు. తొలి ప్రయత్నంలో వారసులను నిలబెట్టలేక మనోవేదనకు గురయ్యారు. అదే అనుకుంటే.. వైసీపీ ప్రభుత్వం వారిని వెంటాడి వేటాడుతోంది. రెండేళ్ల నుంచి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. […]

Written By: Srinivas, Updated On : January 4, 2021 12:17 pm
Follow us on


ఓటమి ఎరుగని రికార్డు వారిది. వయసు మీద పడుతోంది.. ఇక రెస్ట్‌ తీసుకోవాలని అనుకున్నారు. కానీ.. ఎందుకో వారికి ఆ మాట అస్సలు కలిసిరావడం లేదు. వాళ్లే జేసీ బ్రదర్స్‌. ఓటమి ఎరుగకుండా తమ రికార్డును తామే కాపాడుకున్నా.. వారి వారసుల విషయంలో మాత్రం ఫెయిల్యూర్స్‌ చూశారు. తొలి ప్రయత్నంలో వారసులను నిలబెట్టలేక మనోవేదనకు గురయ్యారు. అదే అనుకుంటే.. వైసీపీ ప్రభుత్వం వారిని వెంటాడి వేటాడుతోంది. రెండేళ్ల నుంచి వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. వారి ట్రాన్స్ పోర్ట్ వ్యాపారం దగ్గర్నుంచి మైన్స్ వరకూ మొత్తం ఎక్కడిదక్కడ ఉండిపోయింది. వారికి ఆర్థిక నష్టాలకు తోడు ప్రభుత్వ కేసులు అదనం.

Also Read: కృష్ణా బోర్డుపై జగన్‌ యూటర్న్‌..: విశాఖలో పెట్టాలంటూ కేంద్రానికి లేఖ

అందుకే.. ఇప్పుడు ప్రభుత్వంపై ప్రత్యక్ష పోరాటానికి దిగుతున్నారు. మొదట్లో కొంత కాలం టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. కానీ.. వేధింపులు ఆగకపోవడంతో ఇప్పుడు మరింత దూకుడుగా పెంచాలని నిర్ణయించారు. పెద్దారెడ్డి నేరుగా ప్రభాకర్ రెడ్డి ఇంటికే వచ్చి సవాల్ చేయడంతో.. ఇక వెనక్కి తగ్గితే వర్గాన్ని కాపాడుకోవడం కష్టం అవుతుందన్న అంచనాకు వచ్చారు. అందుకే.. జేసీ దివాకర్ రెడ్డి కూడా తెర ముందుకు వచ్చారు. తన వర్గీయులపై అట్రాసిటీ కేసులు అక్రమంగా బనాయిస్తున్నారని చెబుతూ.. ఆమరణదీక్షలకు ప్లాన్ చేశారు. దాన్నిసోమవారమే చేస్తున్నారు. దీక్షల కారణంగా.. తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పోలీసులు పోలీస్ యాక్ట్ అమలు చేస్తున్నారు.

Also Read: కేంద్రంలో బీజేపీ ఉండాలా.. ఏపీలో వైసీపీ ఉండాలా..!: ఇదే ఆ రెండు పార్టీల ఫ్రెండ్‌షిప్

అనంతపురం జిల్లా తాడిపత్రిలో పది రోజులుగా జరుగుతున్న వార్ ఫైనల్‌కు చేరుకుంది. ఈనెల 24న ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. జేసీ ఇంటికి వెళ్లడంతో మొదలైన గొడవ చాలా మలుపులు తిరిగింది. పోలీసులు కొన్నిరోజులుగా నమోదు చేస్తున్న ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులపై పోరాటానికి సిద్ధమయ్యారు జేసీ బ్రదర్స్‌. ఈ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారన్నది ప్రభాకర్‌రెడ్డి ఆరోపణ..? అయితే తమ్ముడు చేస్తున్న ఆమరణ దీక్షకు అన్నదివాకర్ రెడ్డి కూడా మద్దతు పలికారు. కేవలం మద్దతు మాత్రమే కాదు.. తానూ దీక్ష చేస్తానని..70 ఏళ్ల పైబడ్డ వారు వచ్చి దీక్షల్లో కూర్చోండని పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

మరోవైపు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు దుర్వినియోగం చేస్తున్నారని జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. పోలీసుల్ని అనుమతి కోరినా ఇవ్వరని.. కేవలం తాను, అన్న దివాకర్ రెడ్డి నల్లబట్టలతో మౌనంగా వెళ్లి వినతిపత్రాలు అందజేస్తామన్నారు. ఇటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల గురించి జేసీ బ్రదర్స్‌ మాట్లాడడం సిగ్గుచేటన్నారు ఎమ్మెల్యే పెద్దారెడ్డి. లోకల్‌ బాడీ ఎన్నికల కోసం సాగుతున్న పొలిటికల్‌ డ్రామా అంటూ సెటైర్లు వేశారు. మరోవైపు.. జేసీ సోదరుల దీక్షతో తాడిపత్రిలో భారీగా పోలీసుల్ని మోహరించి కవాతు నిర్వహించారు. వారు వెళ్తుండగా ప్రభాకర్‌రెడ్డి రోడ్డు పక్కన కూర్చుని అందరికీ దండాలు పెట్టారు. ఇటు నిరసనలకు ఎలాంటి అనుమతి లేదని పోలీసులు చెబుతున్నారు. మొత్తానికి జేసీ బ్రదర్స్‌ ఆమరణ దీక్ష పిలుపుతో ఏం జరగబోతుందోన్న టెన్షన్‌ కనిపిస్తోంది. తాడిపత్రి ఖాకీ వలయంలో ఉంది.