Visakhapatnam steel plant: ఆంధ్రప్రదేశ్ లో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పార్టీల్లో రగడ సృష్టిస్తోంది. జనసేన పార్టీ వైసీపీని టార్గెట్ చేసుకుని విమర్శలకు దిగుతోంది. టీడీపీ సైతం దీనపై దుమారమే రేపుతోంది. ఈ నేపథ్యంలో వైసీపీ సైతం ప్రతిపక్షాలను లక్ష్యంగా చేసుకుని ఆరోపణలు చేస్తున్నా వైసీపీనే అభాసుపాలవుతోంది. ఈ నేపథ్యంలో రాష్ర్టంలో రాజకీయ పరిణామాలు తీవ్రంగా మారుతున్నాయి దీంతో పార్టీలు స్టీల్ ప్లాంట్ నే లక్ష్యంగా చేసుకుని పోరుకు దిగుతున్నాయి.

బీజేపీని మాత్రం నిందించడం లేదు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరించాలని బీజేపీ భావిస్తున్నా దాన్ని టార్గెట్ చేసుకోవడానికి జంకుతున్నాయి. అందుకే అన్ని పార్టీలు వైసీపీపైనే విమర్శలు గురిపెడుతున్నాయి. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశంపై గతంలో కూడా పవన్ కల్యాణ్ అధికార పార్టీ వైసీపీపైనే విమర్శలు గుప్పించారు. బీజేపీని మాత్రం ఒక్క మాట కూడా అనలేదు. దీంతో విశాఖ స్టీల్ వ్యవహారం వైసీపీకే తలనొప్పిగా మారుతోందని తెలుస్తోంది.
దీంతో వైసీపీకి ఏం పాలుపోవడం లేదు. అధికారంలో ఉన్నా ఉక్కు పరిశ్రమ సమస్యగా మారుతోంది. జనసేన, టీడీపీ పార్టీ ఏదైనా వైసీపీనే టార్గెట్ చేసుకుంటున్నాయి. దీంతో దానికి ఏం అర్థం కావడం లేదు. అసలు బీజేపీనే ప్రైవేటీకరించాలని చూస్తున్నా దానిపై విమర్శలకు దిగే సాహసం చేయడం లేదు. దీంతో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
Also Read: AP Politics: హత్యారోపణల చుట్టూ తిరుగుతున్న ఏపీ రాజకీయాలు..!
రాబోయే ఎన్నికల్లో విశాఖ స్టీల్ ప్లాంట్ వ్యవహారం పార్టీలకు కొరకరాని కొయ్యగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. బీజేపీ మాత్రం దీంతో ఎలాంటి ఇబ్బందులకు గురికాకపోవచ్చని తెలుస్తోంది. ప్రాంతీయ పార్టీలకు తలనొప్పిగా మారే అవకాశాలున్నాయి. పార్టీల విజయావకాశాలకు గండి కొట్టే ప్రమాదం ఏర్పడింది. దీంతో పార్టీలు ఏ వైఖరి అవలంభిస్తాయో వేచి చూడాల్సిందే.
Also Read: Padayatra: తుది అంకానికి చేరుకున్న ‘మహాపాదయాత్ర’.. ఉత్కంఠ?