Samantha: “ఊ అంటావా మావా.. ఊహు అంటావా” అంటూ సమంత బోల్డ్ లోకాన్ని ఆకట్టుకునేలా హద్దులు మీరి మరీ రెచ్చిపోయింది. టూ-పీస్ గౌను వేసుకుని, తనలోని అందాలను విపరీతమైన కదలికలతో మొత్తానికి అందాల ఆరబోతతో గ్లామర్ ప్రపంచం పై నిప్పులు రాజేసింది. ఇక అల్లు అర్జున్ తో సమంత చేసిన డ్యాన్స్ విజువల్స్ కూడా పరిధి దాటాయి.

పైగా లిరికల్ వీడియోలోని స్టిల్స్ లో కూడా సమంత తన అందాలను అడ్డు అదుపు లేకుండా పరిచేసింది. దీనికితోడు స్పష్టమైన ఎఫెక్ట్ లు, ఇక నటిగా సామ్ ధరించిన దుస్తులు కూడా ఊపు పెంచాయి. ఇక చంద్రబోస్ రాసిన ఈ పాట మొత్తం ‘మగ బుద్ధి’ గురించి.. ముఖ్యంగా పురుషుల కామ స్వభావం పై ఉండటం, దేవి శ్రీ ప్రసాద్ మరోసారి క్యాచీ ట్యూన్ తో హీట్ పెంచాడు.
అన్నట్టు సమంత ఐటమ్ సాంగ్ అనేసరికి అభిమానుల్లో అంచనాలు తారాస్థాయికి వెళ్లాయి. అయితే.. ఈ ఐటమ్ సాంగ్ పై వెంటనే నిషేధం విధించాలని కోరుతూ అభ్యంతరాలు కూడా వ్యక్తం అవుతుండటం విశేషం. ఆంధ్రాలోని ఓ సంస్థ ఈ పాటలోని లిరిక్స్ పై కేసు వేశారు. అసలు ఇలాంటి బూతు పాటలో సమంత ఎందుకు నటించింది అంటూ సమంత పై సాంప్రదాయ వాదులు సీరియస్ అవుతున్నారు.
Also Read: Radhe Shyam: “రాధేశ్యామ్” సినిమాకి జపనీస్ ఫ్రీ పబ్లిసిటీ
ఇంతకీ పాట కేసు వేయడానికి ప్రధాన కారణం.. ఈ సాంగ్ లిరిక్స్ లో.. పురుషులు ఎల్లప్పుడూ వికృతమైన మనస్సు కలిగి ఉంటారనే అర్ధాన్ని బాగా ఎలివేట్ చేశారు. అదేవిధంగా పురుషులు ఎల్లప్పుడూ శృంగారం గురించే ఆలోచిస్తారనే భావాన్ని కూడా ఈ పాటలో బాగా ఎస్టాబ్లిష్ చేశారు. అందుకే వీలైనంత త్వరగా ‘ఊ అంటావా..’ పాటను సినిమాలో నుండి నిషేధించాలని సదరు సంస్థ వారు డిమాండ్ చేస్తున్నారు.