జీవిత కాలాన్ని పెంచుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? ఆరోగ్యంగా బతకాలని ఎవరు మాత్రం కోరుకోరు? నిజానికి.. మనుషుల ఆలోచనల్లో ఎక్కువ భాగం వీటిగురించే ఉంటాయి. ఇందుకోసం ఎంతో కష్టపడటానికీ.. కొన్ని ఇష్టాలను దూరం చేసుకోవడానికీ సిద్ధపడతారు. అయితే.. ఎలాంటి కష్టాలు లేకుండా.. ఇష్టమైన సుఖంతో జీవిత కాలాన్ని పెంచుకోవచ్చని చెబుతున్నారు నిపుణులు.
వాళ్లు చెప్పే సుఖమైన మార్గం శృంగారం. ఈ భూమ్మీదున్న ప్రతీజీవి కేవలం సంతానాభివృద్ధి కోసమే శృంగారంలో పాల్గొంటుంది. అది కూడా.. సీజన్ ప్రకారమే ఆడ, మగ జీవులు కలుస్తాయి. కానీ.. కేవలం రెండు జీవులు మాత్రమే సంతానంతోపాటు ఆనందం కోసం శృంగారంలో పాల్గొంటాయి. అందులో ఒకటి డాల్ఫిన్ కాగా.. మరొకటి మనిషి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు.. మనిషి జీవితంలో శృంగారం ఎంత కీలకమైనదోనని!
అయితే.. భారత్ లాంటి సంప్రదాయ దేశాల్లో శృంగారం గురించి మాట్లాడడాన్ని కూడా తప్పుగా భావిస్తారు. అందుకే.. ఎంతో మంది తమ కోరికలను అణచుకుంటారు. పూర్తిగా చంపేసుకుంటారు కూడా. ఇక, పెళ్లి తర్వాత పిల్లలు వచ్చేంత వరకే శృంగారమని భావించే వాళ్లు కూడా ఉన్నారు. ఇది చాలా తప్పు అంటున్నాయి పరిశోధనలు, రెగ్యులర్ గా రతి క్రీడను ఆస్వాదిస్తే.. ఆనందంతో పాటు జీవితాన్నీ పెంచుకోవచ్చని సూచిస్తున్నారు.
సరిగ్గా శృంగారంలో పాల్గొంటే.. ఎలాంటి జబ్బులూ దరి చేరకుండా.. దీర్ఘాయుష్షు పెంచుకోవచ్చని సూచిస్తున్నారు. వారానికి ఒకసారి కన్నా తక్కువగా మంచం ఎక్కే వారితో పోలిస్తే.. రెండు అంతకన్నా ఎక్కువసార్లు కలిసే వారు ఎంతో యాక్టివ్ గా ఉంటారని చెబుతున్నారు.
క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ.. శృంగారంలో వారానికి రెండుమూడు సార్లు పాల్గొనే వారు ఏకంగా 20 ఏళ్లపాటు జీవిత కాలాన్ని పొడిగించుకునే అవకాశం ఉందట. ఇలా ఉండాలనుకునేవారు చేపలు, సోయ, చికెన్, ఎగ్స్, ఫ్రూట్స్, పీచు ఎక్కువగా తీసుకోవాలను సూచిస్తున్నారు.