WhatsApp: దేశంలో కోట్ల సంఖ్యలో వాట్సాప్ యూజర్లు ఉన్నారు. వాట్సాప్ మెసేజింగ్ యాప్ ను ప్రధానంగా సందేశాలను పంపించడానికి ఎక్కువమంది వినియోగిస్తున్నారు. అయితే కొన్నిసార్లు వాట్సాప్ యూజర్లు చేసే చిన్నచిన్న పొరపాట్ల వల్ల అకౌంట్ డిలేట్ అయ్యే అవకాశంతో పాటు బ్లాక్ అయ్యే అవకాశం కూడా ఉంది. వాట్సాప్ యూజర్లు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలను తీసుకోవాలి. తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల వాట్సాప్ బ్లాక్ అయ్యే అవకాశం ఉండదు.

వాట్సాప్ యూజర్ల డేటాకు మెరుగైన భద్రతను అందించడానికి కంపెనీ కొన్ని నియమనిబంధనలను తయారు చేసింది. వాట్సాప్ రక్షణ వ్యవస్థ ద్వారా మోసాలకు చెక్ పెట్టడానికి, వేధింపులను అడ్డుకోవడానికి రూల్స్ ను అమలులోకి తెచ్చింది. నిబంధనలను అతిక్రమించిన వాట్సాప్ యూజర్ల ఖాతాలు బ్లాక్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. కొంతమంది అవగాహనారాహిత్యంతో చేసే తప్పులు వాట్సాప్ ఖాతాలు బ్లాక్ కావడానికి కారణమవుతున్నాయి.
ఈ ఏడాది జులై నెలలో 30 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్యాన్ చేసిన వాట్సాప్ ఆగష్టు నెలలో 20 లక్షల వాట్సాప్ ఖాతాలను బ్లాక్ చేసింది. వాట్సాప్ ఖాతాను బ్లాక్ లేదా డిలీట్ చేయకుండా ఉండాలంటే థర్డ్ పార్టీ యాప్స్ కు వీలైనంత దూరంగా ఉండాలి. వాట్సాప్ ప్లస్, వాట్సాప్ మోడ్, జీబీ వాట్సాప్ యాప్స్ ను వినియోగిస్తే వాట్సాప్ అకౌంట్ బ్యాన్ అయ్యే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.
అవతలి వ్యక్తుల అనుమతులు లేకుండా ప్రమోషనల్ లేదా బిజినెస్ మెసేజ్ లు పంపితే కూడా వాట్సాప్ ఖాతాను బ్లాక్ చేసే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. ఒకవేళ ఖాతా బ్లాక్ అయితే వెంటనే వాట్సాప్ కు అప్పీల్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత చెప్పే కారణాలు కరెక్ట్ అని భావిస్తే వాట్సాప్ అకౌంట్ యాక్టివేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది.