CM Jagan: ఏపీలో ప్రతిసారి చాలా విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇతర రాష్ట్రాల కంటే చాలా భిన్నమైన విధంగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోంది. గతంలో కూడా ఇలాగే స్కూళ్ల విషయంలో వెనకడుగు వేసి చివరకు విమర్శలు ఎదుర్కొన్నది. సెకండ్ వేవ్ సమయంలో కూడా స్కూళ్లను మూసివేయకుండా ఉంటే.. అప్పుడు ప్రతిపక్షాలు నిరసనలు వ్యక్తం చేశాయి. చివరకు ప్రజల నుంచి విమర్శలు రావడంతో వెనక్కు తగ్గి స్కూళ్లను మూసివేసింది.
ఇక ఇప్పుడు కూడా థర్డ్ వేవ్ తీవ్రంగా వ్యాపిస్తున్నా కూడా.. ఏపీ ప్రభుత్వం మాత్రం స్కూళ్ల విషయంలో వెనకంజ వేస్తోంది. స్కూళ్లలో కరోనా ప్రబలుతున్నా కూడా మూసివేసే ప్రసక్తే లేదంటూ తేల్చి చెప్పేసింది. స్టూడెంట్లకు కరోనా వస్తే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటామని, స్కూళ్లను మాత్రం మూసివేసేది లేదని తేల్చి చెప్పేశారు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్. దీంతో ప్రతిపక్షాల నుంచి మళ్లీ తీవ్రమైన విమర్శలు వస్తున్నాయి.
Also Read: కేటీఆర్ .. మరోసారి మనసు దోచేశాడట.!
ఇంకోవైపు ప్రజల నుంచి కూడా కొంత డిమాండ్ వస్తుంది. స్కూళ్లకు వెంటనే సెలవులు ప్రకటించాలని ఇప్పటికే చంద్రబాబు నాయుడు, లోకేష్ డిమాండ్ చేశారు. ఇక మిగతా పార్టీలు కూడా ఇలాంటి డిమాండ్లు బాగానే చేస్తున్నాయి. అయితే ప్రతిపక్షాల నుంచి ఇన్ని రకాల విమర్శలు రావడానికి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే చాలా స్కూళ్లలో కరోనా కేసులు నమోదువుతున్నాయి. స్టూడెంట్లు ఇబ్బందులు పడుతున్నారు.
అయితే మరోవైపు ప్రభుత్వం ఇతర వాణిజ్య పరమైన కంపెనీలు, థియేటర్లు, మాల్స్, ఫంక్షన్ హాల్లు సగం ఆక్యుపెన్సీతోనే నడవాలంటూ చెబుతోంది జగన్ సర్కార్. మరి ఇన్ని అంశాలపై ఆంక్షలు విధిస్తున్న జగన్ ప్రభుత్వం.. స్కూళ్ల విషయంలో మాత్రం ఎందుకు వెనకడుగు వేస్తోందని విమర్శలు గుప్పిస్తున్నారు. చూడాలి మరి జగన్ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటో స్కూళ్ల మీద.
Also Read: అప్పటి ముచ్చట్లు : ‘ఎన్టీఆర్ గారు పిలిస్తే.. రాకుండా ఎలా ఉండగలం ?