Pushpa: పుష్ప మూవీలోని మొగిలీస్ పాత్ర పోషించింది ఎవ‌రో తెలుసా..?

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లై ఎన్ని ర‌కార్డులు తిర‌గరాసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఏదైనా సినిమా వ‌స్తే.. కేవ‌లం అందులో హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే గుర్తుకు ఉంటాయి. కానీ పుష్ప విష‌యానికి వ‌స్తే మాత్రం ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క క్యారెక్ట‌ర్ మ‌న‌కు గుర్తుండిపోతుంది. విల‌న్ ద‌గ్గ‌రి నుంచి క‌మెడియ‌న్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క పాత్ర మ‌న మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాగా […]

Written By: Suresh, Updated On : January 19, 2022 9:09 am
Follow us on

Pushpa: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ న‌టించిన పుష్ప మూవీ థియేట‌ర్ల‌లో విడుద‌లై ఎన్ని ర‌కార్డులు తిర‌గరాసిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. మ‌న‌కు తెలిసినంత వ‌ర‌కు ఏదైనా సినిమా వ‌స్తే.. కేవ‌లం అందులో హీరో, హీరోయిన్ల క్యారెక్ట‌ర్లు మాత్ర‌మే గుర్తుకు ఉంటాయి. కానీ పుష్ప విష‌యానికి వ‌స్తే మాత్రం ఇందులో న‌టించిన ప్ర‌తి ఒక్క క్యారెక్ట‌ర్ మ‌న‌కు గుర్తుండిపోతుంది. విల‌న్ ద‌గ్గ‌రి నుంచి క‌మెడియ‌న్ వ‌ర‌కు ప్ర‌తి ఒక్క పాత్ర మ‌న మీద ఇంపాక్ట్ చూపిస్తుంది.

Pushpa

కాగా ఈ మూవీలో మంగ‌ళం శ్రీనుగా సునీల్ న‌టిస్తే.. ఆయ‌న భార్య‌గా అన‌సూయ న‌టించి మెప్పించారు. ఇప్ప‌టికీ స‌క్సెస్ ఫుల్ గా ర‌న్ అవుతోంది. మొద‌ట్లో కొంచెం నెగెటివ్ టాక్ వ‌చ్చినా.. క‌లెక్ష‌న్ల ప‌రంగా మాత్రం ఎక్క‌డా వెన‌క్కు త‌గ్గ‌కుండా.. స‌క్సెస్ రేట్ తో దూసుకుపోతోంది. ఇక పోతే ఈ మూవీలో చాలా కొత్త‌వాళ్లు క‌నిపించారు. అన‌సూయ త‌మ్ముడిగా న‌టించిన మొగిలీస్ పాత్ర కూడా చాలా బాగా పేరు తెచ్చుకుంది.

Also Read: మిగ‌తా విష‌యాల‌పై ఉన్న శ్ర‌ద్ధ స్కూళ్లపై ఉండ‌దా.. జ‌గ‌న్ ఎందుకిలా..?

ఈ మూవీలో ఆయ‌న‌ది చాలా ప‌వ‌ర్ ఫుల్ పాత్ర‌. అన‌సూయ త‌మ్ముడిగా అత్యంత భ‌యంక‌రంగా క‌నిపిస్తాడు. కాగా అత‌ని మ‌ర‌ణంతోనే సినిమా మ‌రో మ‌లుపు తీసుకుంటుంది. ఇక‌పోతే అస‌లు మొగిలీస్ పాత్ర‌లో న‌టించింది ఎవ‌రు అని చాలామంది వెతుకుతున్నారు. ఈ పాత్ర చేసిన అత‌ని పేరు రాజ్ తిరందసు. కొత్త పోరడు అనే మూవీలో ఇంత‌కు ముందు న‌టించాడు. అందులో చాలా చిన్న పాత్ర పోషించాడు.

ఒక వెబ్ సిరీస్‌లో కూడా యాక్ట్ చేశారు రాజ్‌. అయితే పుష్ప రాజ్ మూవీలో మాత్రం చాలా కీల‌క‌మైన రోల్ చేసి బాగా పాపుల‌ర్ అయిపోయారు. పుష్ప మూవీలో సునీల్ వెన్నంటే ఉండి.. ప్ర‌తి సీన్ లో కూడా మెరుస్తాడు. ఈ మూవీ అత‌నికి మంచి బ్రేక్ తీసుకువ‌చ్చింద‌నే చెప్పొచ్చు. ఇక నిఖిల్, అనుపమ క‌లిసి చేస్తున్న 18 పేజెస్ మూవీలో కూడా కీల‌క‌మైన పాత్ర పోషిస్తున్నారంట‌.

Also Read: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కెమికల్‌ బయాలజీలో జాబ్స్.. నెలకు రూ.లక్ష వేతనంతో?

Tags