SBI : భారత్లో జమ్ము కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కేరళ వరకు ఎస్బిఐ కి శాఖలు ఉన్నాయి. వేలాదిమంది ఈ బ్యాంకులో పనిచేస్తున్నారు. ప్రతి ఏడాది లక్షల కోట్లలో టర్నోవర్ జరుగుతుంది. వేలకోట్ల రూపాయలు లాభం వస్తుంది. అయితే అంతటి చరిత్ర ఉన్నప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సేవల విషయంలో నాసిరకం తీరును ప్రదర్శిస్తోంది. నేటి డిజిటల్ కాలంలోనూ ఎస్బిఐ సేవలు అత్యంత దరిద్రంగా ఉన్నాయి. ఇదే విషయం అనేక సందర్భాల్లో నిరూపితమైంది. అయినప్పటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన తీరు మార్చుకోవడం లేదు. బ్యాంకింగ్ లో.. బ్యాంకింగ్ కార్యకలాపాలలో ఖాతాదారుల అభిమానాన్ని పొందాల్సిన సమయంలో.. అత్యంత నాసిరకమైన సేవలు అందిస్తూ పరువు తీసుకుంటున్నది. కొన్ని సందర్భాల్లో అయితే ఆ సేవలు కూడా నిలిచిపోతున్నాయి. దీంతో ఖాతాదారులకు చుక్కలు కనిపిస్తున్నాయి. ఇక బుధవారం దేశవ్యాప్తంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లావాదేవీలు నిలిచిపోయాయి. దీంతో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.
Also Read : మహిళలకు ఎస్‌బీఐ కానుక.. మహిళా దినోత్సవంగా స్పెషల్ స్కీంలు..
ఇంతకీ ఏం జరిగిందంటే
దేశవ్యాప్తంగా బుధవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి. ముఖ్యంగా యూపీఐ యాప్ లో ఎస్బిఐ అకౌంట్ నుంచి కొనసాగిస్తున్న లావాదేవులు పూర్తిగా ఆగిపోయాయి. అంతేకాదు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అకౌంట్ ఉన్నవారు చేస్తున్న లావాదేవీలు సైతం విఫలమవుతున్నాయి. మంగళవారం కూడా ఇలాంటి సమస్య ఎదురయింది. దీంతో ఖాతాదారులు ఇబ్బంది పడ్డారు. ఇక బుధవారం కూడా అదే సమస్య రావడంతో ఖాతాదారులు నరకం చూశారు. డబ్బులు బదిలీ కాక.. వచ్చే డబ్బులు రాకపో వడంతో ఖాతాదారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి.. దేశంలో అతిపెద్ద ప్రభుత్వంగ బ్యాంకు అయిన ఎస్బిఐలో ఇలాంటి పరిస్థితి తలెత్తడం దారుణమని ఖాతాదారులు వాపోతున్నారు.
ఎన్నిసార్లు ఈ సాంకేతిక సమస్య
సేవలు నిలిచిపోయిన ప్రతిసారి ఎస్బిఐ ఒక ప్రకటన చేస్తుంది. సాంకేతిక సమస్యల వల్ల ఇబ్బంది ఎదురవుతోందని చావు కబురు చల్లగా చెబుతుంది. ఇక ఇప్పుడు ఆ మాత్రం ప్రకటన చేసే దిక్కు కూడా లేకపోయింది. కనీసం సమస్య ఎక్కడ ఎదురయింది? ఎందువల్ల ఎదురైంది? ఎప్పుడు అది పరిష్కారం అవుతుంది? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పే దిక్కు లేకుండా పోయింది. దీంతో ఖాతాదారులు తమ అకౌంట్లో డబ్బులు ఉన్నప్పటికీ ఇతరులకు బదిలీ చేసుకోలేని దుస్థితి ఏర్పడింది. దీంతో లావాదేవీలు కొనసాగాక చాలామంది ఇబ్బంది పడ్డారు. ఇక ఎస్బిఐ తీరుపై చాలామంది సోషల్ మీడియాలో తమదైన ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు..” ఖాతాలో డబ్బులు ఉన్నప్పటికీ యూపీఐ లావాదేవీలు కొనసాగడం లేదు. దీంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఏదైనా కొనేందుకు షాపుకు వెళ్తే.. అక్కడ స్కాన్ చేసి డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తుంటే వెళ్లడం లేదు. దీంతో షాపు నిర్వాహకులు మమ్మల్ని అసలు డబ్బులు ఉన్నాయా వీళ్ళ దగ్గర అన్నట్టుగా చూస్తున్నారు. ఎస్బిఐలో ఖాతా కలిగి ఉన్నందుకు మాకు భలే సన్మానం జరుగుతోందని” ఖాతాదారులు సోషల్ మీడియాలో వాపోతున్నారు. మంగళవారం, బుధవారం ఇలాంటి సమస్యలు ఎదురు కావడంతో ఖాతాదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. మరి ఈ సమస్యను ఎస్బిఐ ఎప్పుడు పరిష్కరిస్తుందో చూడాలి.
Also Read : ఎస్‌బీఐ నుంచి మరో నోటిఫికేషన్.. ఈసారి డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. వివరాలు ఇవే..!