SBI: భారత దేశంలో ప్రభుత్వరంగ సంస్థల్లో ఉద్యోగ నియామకాలు చాలా వరకు తగ్గిపోయాయి. రెండు మూడేళ్లకు గానీ ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు. చివరకు సైనిక నియామకాలు కూడా తగ్గాయి. అగ్నివీర్ పేరుతో పరిమిత కాలంలో పనిచేసేలా నియామకాలు చేసడుతోంది. ఇలాంటి తరుణంలో ఎస్‌బీఐ ఇటీవలే క్లరిక్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. ఇందులో బాంగా 32 వేల ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టింది. తాజాగా అదే ఎస్‌బీఐ పీవో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిజీల్‌జ్ చేసింది. డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు భర్తీ చేయనుంది. విద్యార్హతలు, ఎంపిక విధానం గురించిన వివరాలు ఇలా ఉన్నాయి.
600 పోస్టులు..
దేశంలో అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంకు స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా. సెంట్రల్ రిక్రూట్‌మెంట్ అండ్ ప్రమోషన్ డిపార్ట్‌మెంట్, కార్పొరేట్ సెంటర్ భారీ ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల చేసింది. 600 ప్రొబేషనరీ ఆఫీసర్ల పోస్టులు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ పీవోల నియామకాలకు సబంధించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ డిసెబర్ 27న ప్రారంభం అవుతుంది. 2025, జనవరి 16వ తేదీ వరకు దరఖాస్తు గడువు విధించింది.
భర్తీ విధానం ఇలా..
పీవో పోస్టుల భర్తీకి సంబంధించిన అభ్యర్థులు ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షలతోపాటు ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. పీవోలుగా ఎంపికైతే రెండేళ్లు ప్రొబేషనరీ ఆఫీసర్లుగా పని చేయాల్సి ఉంటుంది. వీరికి నెలకు రూ.48,480 నుంచి రూ.85,920 వరకు వేతనం ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌లో చూడొచ్చు.
కీలక సమాచారం..
ప్రొబేషనరీ ఆఫీసర్ నోటిఫికేషన్ : 600
అర్హతలు : అభ్యర్థులు ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. చివరి సంవత్సరం విద్యార్థులు కూడా అర్హులే. అభ్యర్థుల వయోపరిమితి 30 ఏళ్లలోపు ఉండాలి.
జీత భత్యాలు..
ఇక పీవోగా ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.48.430 వేలనం ఇస్తారు. గరిష్టంగా రూ.85,920 వేతనంపొందే వీలు ఉంటుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకునేవారు రూ.750 ఫీజు చెల్లించాలి, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థులను ఫేజ్–1 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఉంటుంది. స్టేజ్–2 మెయిన్ ఎగ్జామ్ ఉంటుంది. ఫేజ్ – 3 సైకోమేటిక్ టెస్ట్, గ్రూప్ ఎక్సర్‌సైజ్ ఇంటర్వ్యూ, డాకుమెంటే వెరిఫికేషన్ ఉంటుంది. మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు.
నోటిఫికేషన్ ముఖ్యమైన తేదీలు :
ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభతేదీ : డిసెంబర్ 27, 2024
ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరితేదీ: జనవరి 16, 2025
ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ల డౌన్‌లోడ్ : 2025, ఫిబ్రవరి చివరి వారంలో..
స్టేజ్–1లో ఆన్‌లైన్ విధానంలో పరీక్ష తేదీలు : మార్చి 8, 15, 2025
ప్రిలిమినరీ పరీక్ష ఫలితాల ప్రకటన : ఏప్రిల్ 2025
మెయిన్ ఎగ్జామినేషన్ కాల్ లెటర్ డౌన్‌లోడ్ : 2025, ఏప్రిల్ రెండో వారంలో..
స్టేజ్–2లో భాగంగా ఆన్‌లైన్ మెయిన్ ఎగ్జామ్ : 2025, ఏప్రిల్/ మే నెలలో
మెయిన్ పరీక్ష ఫలితాల ప్రకటన : మే/ జూన్ 2025
ఫేజ్–3 కాల్ లెటర్ డౌన్‌లోడ్ : మే/ జూన్, 2025
ఫేజ్ 3– సైకోమెట్రిక్ పరీక్ష : మే/ జూన్, 2025
ఇంటర్వ్యూ, గ్రూప్ ఎక్సర్‌సైజ్ తేదీలు : మే/ జూన్, 2025
తుది ఫలితాల ప్రకటన : మే/ జూన్, 2025
Raj Sekhar is a senior content writer with good knoledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
Read MoreWeb Title: Another notification from sbi this time jobs with degree qualification the details are here
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com