Court Movie Twitter Review
Court Movie Twitter Review : హీరో నాని స్వయంగా నిర్మించిన కోర్ట్ మూవీ ప్రీమియర్స్ ముగిశాయి. ఈ క్రమంలో ఆడియన్స్ తమ అభిప్రాయం తెలియజేస్తున్నారు. కోర్ట్ మూవీ నచ్చకపోతే తాను నటించిన హిట్ 3 మూవీ చూడొద్దని సవాల్ విసిరిన నేపథ్యంలో, కోర్ట్ మూవీ టాక్ ఏంటో చూద్దాం.
Nani ni easy ga Hit machine aneyochu
Adhem script selection ayya mental @NameisNani
Kani lockdown nani ki help ayinattu evariki avvaledhu. V movie, Tuck jagadish lanti rods OTT ki ichesadu..
SSR, Ante, Hi nanna, hit series, SS
Now #Court
pic.twitter.com/EtYMqUucKz— Legend Prabhas (@CanadaPrabhasFN) March 13, 2025
సోషల్ మెసేజ్ సినిమాలు తక్కువగా వస్తాయి. వాటికి చెప్పుకోదగ్గ మార్కెట్ ఉండదు. అందుకే నిర్మాతలు సాహసాలు చేయరు. నేచురల్ స్టార్ నాని మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు తేవాలనే ఉద్దేశంతో నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ఏర్పాటు చేసి చిత్రాలు నిర్మిస్తున్నారు. ఆయన నిర్మించిన లేటెస్ట్ మూవీ కోర్ట్. రామ్ జగదీష్ దర్శకత్వం వహించాడు. ప్రియదర్శి, సాయి కుమార్, శివాజీ, హర్ష రోషన్, రోహిణి, శ్రీదేవి ప్రధాన పాత్రలు చేశారు.
High intense Court Drama,#StatevsANobody #Court
Selfish vs Confidence,
War room filed the case on nobody by selfish and Court room Declare the final judgement of Justice ⚖️,
All the Very best for Grand Release Tomorrow @NameisNani Garu ,@PriyadarshiPN Garu and all , pic.twitter.com/AvMdSovbOs— Yejju Akhyl (@AkhilYejju) March 13, 2025
కోర్ట్ మూవీ కోర్ట్ రూమ్ డ్రామాగా తెరకెక్కింది. కొన్ని చట్టాల వలన అమాయకులు ఎలా బలి అవుతున్నారు. చట్టాలను వ్యవస్థలు ఎలా తప్పుదోవపట్టిస్తున్నాయి అనే అంశం ప్రధానంగా కోర్ట్ రూపొందించారు. ఇక కోర్ట్ మూవీ ప్రీ రిలీజ్ వేడుకలో హీరో నాని క్రేజీ కామెంట్స్ చేశాడు. ఒక విధంగా సాహసోపేతమైన సవాల్ విసిరాడు. కోర్ట్ మూవీలో విషయం ఉంది. ప్రతి ఒక్కరికీ నచ్చుతుంది. కోర్ట్ మూవీ ఆడకపోతే.. నేను నటిస్తున్న హిట్ 3 సినిమా చూడొద్దు అన్నారు. నాని అంత కాన్ఫిడెంట్ గా చెప్పాడంటే కోర్ట్ మూవీలో విషయం ఉండాలి మరి.
#Court: Winner
The Court Proceedings and Priyadarshi statements were clap worthy moments
Without any deviation, the story progresses unraveling the hard truths. Importance of POCSO act, asking the right questions, learning about law#Rohini garu’s character❤️
— Kollywood Corner (@kollywood36O) March 13, 2025
కోర్ట్ చిత్రాన్ని మార్చి 14న విడుదల చేస్తున్నారు. ఒకరోజు ముందే ప్రీమియర్స్ ప్రదర్శన జరిగింది. దాంతో సోషల్ మీడియాలో టాక్ స్ప్రెడ్ అయ్యింది. కోర్ట్ చిత్రానికి సోషల్ మీడియాలో పాజిటివ్ టాక్ వినిపిస్తుంది. చట్టాలలో ఉన్న లొసుగులు, సామాన్యులకు అర్ధమయ్యే రీతిలో ఎమోషనల్ గా చెప్పే ప్రయత్నం జరిగిందట. లాయర్ పాత్రలో ప్రియదర్శి అదరగొట్టాడని అంటున్నారు. నెగిటివ్ రోల్ చేసిన శివాజీ పాత్రను ఉద్దేశించి నెటిజెన్స్ ప్రత్యేకంగా కామెంట్స్ చేస్తున్నారు. శివాజీ ఆ పాత్రకు బాగా సెట్ అయ్యాడని, మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చాడని నెటిజెన్స్ అభిప్రాయం.
IDI EKKADI MASS CONFIDENCE MASS NATURAL STAR ⭐️ @NameisNani annnaaa ❤️❤️❤️❤️❤️
Cheppinattu HIT kottesaav #Court tho
INKA #HIT3 ki KRAAAMPPP #Nani #TheParadise #HIT3 pic.twitter.com/d18dkOq6If
— Telugu Cult (@Telugu_Cult) March 13, 2025
హర్ష రోషన్, శ్రీదేవి వంటి యువ నటులు తమ పాత్రలకు న్యాయం చేశారు. సాయి కుమార్ పెర్ఫార్మన్స్ గురించి కూడా ఆడియన్స్ మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతానికి కోర్ట్ మూవీ బాగుంది. జనాలకు ఉపయోగపడే సందేశం, సమాచారం ఉందని టాక్. ఇదంతా పెయిడ్ ప్రమోషన్స్ అనే సందేహం కలుగుతుంది. రియల్ ఒపీనియన్ తెలియాలంటే రేపటి వరకు వేచి చూడాలి. కోర్ట్ చిత్రానికి విజయ్ బుల్గానిన్ సంగీతం అందించారు.
Also Read : ఆకట్టుకుంటున్న ‘కోర్ట్’ థియేట్రికల్ ట్రైలర్..నిర్మాతగా నాని ఖాతాలో మరో హిట్ పడినట్టే!
Web Title: Court movie twitter review how was hero nanis challenging court movie
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com