Homeజాతీయ వార్తలుSBI Bank: మహిళలకు ఎస్‌బీఐ కానుక.. మహిళా దినోత్సవంగా స్పెషల్‌ స్కీంలు..

SBI Bank: మహిళలకు ఎస్‌బీఐ కానుక.. మహిళా దినోత్సవంగా స్పెషల్‌ స్కీంలు..

SBI Bank: మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం. ఈ నేపథ్యంలో మహిళలకు స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శుభవార్త చెప్పింది. భారత దేవంలోని మహిళలందరికీ లబ్ధి కలిగేలా.. ఆర్థికంగా ఎదిగేలా ఈ స్కీంలు రూపొందించింది. మహిళా పారిశ్రామికవేత్తల(women Indastrialist) కోసం ప్రత్యేక పథకాలను ప్రకటించింది. ఈ పథకాల్లో భాగంగా మహిళలకు తక్కువ వడ్డీ రేటుతో షూరిటీ (కొలాటరల్‌) లేకుండా రుణాలు అందించనుంది.

Also Read: మెగా బ్రదర్ నాగబాబు ఆస్తులు ఎంతో తెలుసా? ఎన్ని కోట్లంటే?

ఎస్‌బీఐ అస్మిత (SBI Asmita):: ఇది మహిళా ఉద్యముల కోసం రూపొందించిన ఒక డిజిటల్‌ ఎస్‌ఎమ్‌ఇ (స్మాల్‌ అండ్‌ మీడియం ఎంటర్‌ప్రైజెస్‌) రుణ ఉత్పత్తి. ఈ రుణం ద్వారా వ్యాపార విస్తరణకు అవసరమైన వర్కింగ్‌ క్యాపిటల్‌ లేదా టర్మ్‌ లోన్‌ సులభంగా పొందవచ్చు. ఈ ప్రక్రియ పూర్తిగా డిజిటల్‌గా జరుగుతుంది, దీనివల్ల రుణం తీసుకునే ప్రక్రియ సరళంగా ఉంటుంది.

నారీ శక్తి ప్లాటినం డెబిట్‌ కార్డ్‌: రూపే (RuPay) ఆధారిత ఈ డెబిట్‌ కార్డ్‌ మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఇది వివిధ విభాగాల్లో మహిళల అవసరాలను తీర్చడానికి ఉద్దేశించబడింది.

అదనపు ప్రయోజనాలు: ఈ రుణాలు తీసుకునే ఉత్తమ మహిళా ఉద్యములను గుర్తించి, వారికి వ్యవస్థాపకత మరియు నిర్వహణ శిక్షణ అందించే ప్రణాళిక కూడా ఉంది.

ప్రయోజనాలు:
తక్కువ వడ్డీ రేటు: సాధారణ రుణాల కంటే తక్కువ వడ్డీతో ఈ రుణాలు లభిస్తాయి.
షూరిటీ అవసరం లేదు: ఆస్తులు లేదా గ్యారంటీ లేకుండానే రుణం పొందవచ్చు.
వ్యాపార వృద్ధి: మహిళలు తమ వ్యాపారాలను సులభంగా విస్తరించుకునే అవకాశం.
ఈ పథకం మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం, వ్యాపార అవకాశాలను పెంచడంలో సహాయపడుతుందని ఎస్‌బీఐ భావిస్తోంది.

 

Also Read: అమరావతి పునర్నిర్మాణానికి ముహూర్తం ఫిక్స్.. అప్పటి నుంచే పనులు!

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular