https://oktelugu.com/

శశికళ సీరియస్.. ఆమె సీఎం కల చెదిరినట్టేనా?

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని లేడీ క్యూర్‌జోన్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. బుధవారం ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో గురువారం శశికళను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శశికళ ఆరోగ్యం విషమించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తులు సైతం దెబ్బతిన్నట్లు చెప్పారు. Also Read: కేసీఆర్‌‌లో ఈ […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 22, 2021 / 02:39 PM IST
    Follow us on


    దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి వీకే శశికళ కరోనా వైరస్ బారినపడి తీవ్ర అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. బెంగళూరులోని లేడీ క్యూర్‌జోన్‌ ఆస్పత్రిలో చేర్పించగా.. బుధవారం ఆమెకు కరోనా నిర్ధారణ అయ్యింది. దీంతో గురువారం శశికళను విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం అక్కడ చికిత్స పొందుతున్న శశికళ ఆరోగ్యం విషమించినట్టు వైద్యులు తెలిపారు. ఆమెకు మధుమేహం, రక్తపోటు సమస్యలు ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఊపిరితిత్తులు సైతం దెబ్బతిన్నట్లు చెప్పారు.

    Also Read: కేసీఆర్‌‌లో ఈ మార్పులు ఎవరైనా ఊహించారా..!

    శశికళకు ఐసీయూలోనే వెంటిలేటర్‌పై చికిత్స కొనసాగుతోందని, ఆమె ఆరోగ్యం మరింత క్షీణించిందని పేర్కొన్నారు. జ్వరం, వెన్నునొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. శశికళకు తొలుత యాంటిజెన్‌ పరీక్షల్లో కొవిడ్ నెగెటివ్‌గా వచ్చింది. ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు చేయడంతో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. జయలలిత అక్రమాస్తుల కేసులో దోషిగా తేలి ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న ఆమె జనవరి 27న విడుదల కానున్నారు. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనుండగా.. తన రాజకీయ పునరాగమనానికి ఆమె ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో శశికళ తీవ్ర అస్వస్థతకు గురికావడం, ప్రస్తుతం పరిస్థితి విషమించడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

    దివంగత జయలలితకు ఆప్తురాలిగా శశికళ తమిళనాట చక్రం తిప్పారు. అమ్మ మరణం తర్వాత అన్నాడీఎంకే పగ్గాలు చేపట్టి, ముఖ్యమంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. ఇదే సమయంలో కథ అడ్డం తిరగింది. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు, పన్నీర్ సెల్వం అడ్డం తిరగడం, క్యాంప్ రాజకీయాలతో అనూహ్యంగా పళనిసామి సీఎం అయ్యారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో దోషిగా తేలిసిన శశికళ బెంగళూరు పరప్పన అగ్రహారం కేంద్ర కారాగారంలో శిక్ష అనుభవిస్తున్నారు. ప్రస్తుతం ఆమె శిక్షాకాలం పూర్తయినట్లు అధికారులు తెలిపారు.

    Also Read: పుసుక్కున గెలిచావ్ జగన్.. హేళన చేసిన పవన్

    ఇదే కేసులో శికళతోపాటు ఆమె బంధువులు ఇళవరసి, వీఎన్‌ సుధాకర్‌ 2017 ఫిబ్రవరి నుంచి పరప్పన జైలులో శిక్ష అనుభవిస్తున్నారు. ఇళవరసి ఇంకొంత కాలం శిక్ష అనుభవించాల్సి ఉంది. ఈ కేసులో శశికళ.. ఇళవరసి కంటే ముందే అరెస్టైన నేపథ్యంలో శిక్షా కాలం ముందుగానే పూర్తి చేసుకొని విడుదలవుతున్నారు. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ.10 కోట్లను చెల్లించారు. మొత్తంగా సీఎం కావాలన్నా ఆమె కల నెరవేరేలా కనిపించడం లేదు.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్