https://oktelugu.com/

కేసీఆర్‌‌లో ఈ మార్పులు ఎవరైనా ఊహించారా..!

మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర సీఎం మారబోతున్నారు. కేసీఆర్‌‌ తనయుడు కేటీఆర్‌‌కు పట్టాభిషేకం జరగబోతోంది. ఇదే ప్రచారం ఇప్పుడు రాష్ట్రమంతా రచ్చలేపుతోంది. అయితే.. ఆ ప్రచారం కూడా నిజమే. అయితే.. అదేంటోకానీ పీఠంతోపాటే కేసీఆర్‌‌ మనస్తత్వం కూడా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటివరకు కనిపించిన కేసీఆర్‌‌.. ఇప్పుడు చూస్తున్న కేసీఆర్‌‌లో పలు మార్పులు అయితే కనిపిస్తున్నాయి. Also Read: నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..! నిన్నా మొన్నటివరకు తొడ గొట్టి.. కేంద్రాన్ని […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 22, 2021 / 02:32 PM IST
    Follow us on


    మరికొద్ది రోజుల్లోనే తెలంగాణ రాష్ట్ర సీఎం మారబోతున్నారు. కేసీఆర్‌‌ తనయుడు కేటీఆర్‌‌కు పట్టాభిషేకం జరగబోతోంది. ఇదే ప్రచారం ఇప్పుడు రాష్ట్రమంతా రచ్చలేపుతోంది. అయితే.. ఆ ప్రచారం కూడా నిజమే. అయితే.. అదేంటోకానీ పీఠంతోపాటే కేసీఆర్‌‌ మనస్తత్వం కూడా మారుతున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే మొన్నటివరకు కనిపించిన కేసీఆర్‌‌.. ఇప్పుడు చూస్తున్న కేసీఆర్‌‌లో పలు మార్పులు అయితే కనిపిస్తున్నాయి.

    Also Read: నాయకత్వ మార్పు సీనియర్లకు ఇష్టం లేదా..: అందుకే ఈ సైలెంటా..!

    నిన్నా మొన్నటివరకు తొడ గొట్టి.. కేంద్రాన్ని ఢీ కొడతా అనే కేసీఆర్‌‌లో.. ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. అంతేకాదు.. కేంద్రం ముందు సాగిలపడ్డారు. ఢిల్లీ పర్యటన తర్వాత ఆయనలో మార్పు మరింత కనిపిస్తోంది. తాజాగా ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ఇచ్చే రిజర్వేషన్ల విషయంలోనూ కేంద్ర పథకానికి జై కొట్టారు. రెండేళ్లుగా ఆ పథకం అమలును పట్టించుకోని కేసీఆర్‌‌.. ఈ టైమ్‌లో ఎందుకు అమల్లోకి తెచ్చారో అర్థం కాని విషయం.

    కేంద్రం తీసుకొచ్చిన ఆయుష్మాన్ భారత్‌ను తొలుత తీవ్రంగా వ్యతిరేకించిన కేసీఆర్ ఆ తర్వాత సపోర్టు చేశారు. కేంద్ర పథకంతో వచ్చే లబ్ధిని రాష్ట్ర ప్రజలకు అందించేందుకే ఆ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పారు. వ్యవసాయ చట్టాల విషయంలోనూ కేసీఆర్ వ్యవహార శైలి ఎవరికీ మింగుడు పడలేదు. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు చేస్తున్న పోరాటానికి మద్దతుగా తెలంగాణవ్యాప్తంగా చేపట్టిన బంద్‌కు కేసీఆర్ పూర్తి సహకారం అందించారు. కేంద్రంపై దుమ్మెత్తి పోస్తూ, చట్టాల రద్దు కోసం డిమాండ్ చేశారు. తమ రాష్ట్రంలో అమలు చేసేది లేదని తెగేసి చెప్పారు.

    Also Read: ఆ విషయంలో జగన్‌ ఏం చేయబోతున్నారు..?

    కానీ.. రోజుల వ్యవధిలోనే కేసీఆర్ మనసు మార్చుకున్నారు. పంట అమ్మకానికి గేట్లు ఎత్తేసి.. కేంద్రం తీసుకొచ్చిన చట్టాలకు పరోక్షంగా వత్తాసు పలికారు. రాష్ట్రంలో రైతులు పండించే పంటల విషయంలో ప్రభుత్వం సూచనలు ఇవ్వదని, ఇకపై ప్రభుత్వం సేకరించబోదని కూడా తెగేసి చెప్పారు. చివరిగా ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల విషయంలో కేసీఆర్ పూర్తిగా కేంద్రానికి తలొగ్గారు. మొత్తంగా చూస్తే కేసీఆర్‌‌లో వచ్చిన ఈ మార్పు ప్రజలకు అయితే మేలు చేసేవే.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్