Ap Government: ఎట్టకేలకు ఏపీ లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు జగన్ ప్రభుత్వం కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. ఎన్నికల్లో ఏకగ్రీవం అయినా గ్రామ పంచాయతీ లకు ప్రోత్సాహాల క్రింద 134 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. జిల్లాల వారీగా ఈ నిధులను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. బిజెపి అధ్యక్షుడు సోము వీర్రాజు, టీడీపీ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఎన్నికల్లో ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయించాలని, గ్రామ పంచాయతీల సమస్యలను పరిష్కరించాలని ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లేఖ రాసారు.

ఆ తర్వాత కూడా అనేక సందర్భంలో గ్రామ పంచాయతీలకు ప్రోత్సాహక నిధులు కేటాయించాలని ప్రభుత్వం పై విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలోనే తాజాగా గ్రామ పంచాయతీ లో ప్రోత్సాహక నిధులను విడుదల చేస్తూ ఏపీ ప్రభిత్వం నిర్ణయం తీసుకుంది. పంచాయతీ ఎన్నికల సమయంలో ఏపీ ప్రభుత్వం ఎన్నికలు లేకుండా ఏకగ్రీవం చేసుకున్న పంచాయతీలకు, ఆయా గ్రామాల అభివృద్ధి కోసం ప్రోత్సాహక నిధులను ఇస్తామని జగన్ ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే.
Also Read: Kapu Politics In AP: ‘కాపులే’ పావులుగా ఏపీలో రాజకీయ చదరంగం
దీంతో ఇప్పటికి జగన్ సర్కార్ 134 కోట్ల రూపాయలను గ్రామ పంచాయతీ ప్రోత్సాహక నిధులుగా విడుదల చేసింది. రెండు వేల కంటే ఎక్కువ జనాభా కలిగిన పంచాయతీలకు 5 లక్షల రూపాయలు, రెండు వేల నుండి ఐదు వేల వరకు ఉన్న జనాభా గ్రామాలకు 10 లక్షల రూపాయలు, ఇది వేల నుండి పదివేల జనాభా ఉన్న గ్రామ పంచాయతీ లకు 15 లక్షల రూపాయలు, 10 వేల కంటే ఎక్కువ ఉన్న గ్రామా పంచాయతీలకు 20 లక్షల రూపాయలను ఇస్తామని ప్రకటించారు.
ఏపీ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం నిధులను విడుదల చేయాలనీ ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. వీరి ఒత్తిడి పెరగడంతో పాటుగా గ్రామా పంచాయతీ నిధుల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఒత్తిడి కొనసాగుతున్న నేపథ్యంలో గ్రామీణ అభివృద్ధి శాఖ నుండి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు కోరిందింది. దీంతో ఏకగ్రీవం అయినా 2199 గ్రామా పంచాయతీలకు ప్రోత్సాహక నగదు క్రింద 134 కోట్ల రూపాయలు కేటాయించారు.