Telugu News » Entertainment » The final decision on pan india movies will be made after january 2
Pan India Movies: జనవరి 2 తర్వాతనే పాన్ ఇండియా సినిమాలపై తుది నిర్ణయం
Pan India Movies: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద సీజన్ ఏది అంటే సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఈ పండుగకు భారీ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతాయి. మరి 2022 సంక్రాంతి సీజన్ కు కూడా భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సారి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి సీజన్ లో సందడి చేయడానికి రాబోతున్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ ఒకటి. మరొకటి పాన్ […]
Pan India Movies: మన టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద సీజన్ ఏది అంటే సంక్రాంతి సీజన్ అనే చెప్పాలి. ఈ పండుగకు భారీ సినిమాలు విడుదలకు సిద్ధం అవుతాయి. మరి 2022 సంక్రాంతి సీజన్ కు కూడా భారీ సినిమాలు లైన్లో ఉన్నాయి. ఈ సారి రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు సంక్రాంతి సీజన్ లో సందడి చేయడానికి రాబోతున్నాయి. అందులో రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ ఆర్ ఆర్ ఒకటి.
Pan India Movies
మరొకటి పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రాధేశ్యామ్. ఈ రెండు సినిమాలు సంక్రాంతి సీజన్ కు రాబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో ప్రమోషన్స్ కూడా భారీగా చేస్తున్నారు. ఈ రెండు సినిమాల మధ్య సంక్రాంతి సీజన్ లో వార్ జరగబోతుంది. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి.
ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ కాదు.. అయితే అందరి ద్రుష్టి ఈ రెండు సినిమాల మీద ఉంటే ఈ రెండు సినిమాల ద్రుష్టి జనవరి 2 పైన ఉందట. ఎందుకంటే జనవరి 2 వరకు నార్త్ లో కఠిన నిబంధనలు ఉండనున్న నేపథ్యంలో ఈ డేట్ కోసం రెండు సినిమాల మేకర్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అక్కడి ప్రభుత్వాలు రాత్రి కర్ఫ్యూ విధించడమే కాకుండా, థియేటర్లకు 50 శాతం అక్యుపెన్సీ నిబంధనలు అమలు చేస్తుంది.
కొత్త సంవత్సరం సందర్భంగా జనాలు దగ్గరగా ఉండి సెలెబ్రేషన్స్ చేసుకోవడం వల్ల కరోనా మరింత వ్యాపిస్తుందని ముందుగానే కఠిన నిబంధనలు అమలు పరుస్తున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆర్ ఆర్ ఆర్, రాధే శ్యామ్ సినిమాల విడుదలలు సందిగ్ధంలో పడ్డాయి. ఇవి రెండు కూడా పాన్ ఇండియా సినిమాలు కావడంతో వాటికీ నార్త్ మార్కెట్ చాలా కీలకం కాబట్టి అక్కడ 50 శాతం ఆక్యుపెన్సీ ఉండి, రాత్రి కర్ఫ్యూ అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ సినిమాలు విడుదల చేసేందుకు మొగ్గు చూపారు. నార్త్ లో మార్నింగ్ షోల కంటే సాయంత్రం షోలకు కలెక్షన్స్ బాగా వస్తాయి.. అందుకే ఇది ఆలోచించాల్సిన పరిస్థితి. మరి చూడాలి జనవరి 2 తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో..