https://oktelugu.com/

ఘర్ వాపసీపై రేవంత్ దృష్టి: రివర్స్ అవుతారా..?

తీవ్రమైన పోటీ మధ్య పీసీసీ చీఫ్ పోస్టు దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అసంతృప్తులు, ఆరోపణలు ఎక్కువ. ముఖ్యంగా పార్టీలోని సీనియర్లను కలుపుకోకపోతే అసలుకే ఎసరు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముందుగానే అలాంటి పరిస్థితి ఏర్పడకుండా రోజువారీగా సీనియర్ నాయకులను కలుస్తున్నారు. అవసరమైతే కొందరి నాయకుల ఇంటికి రేవంత్ రెడ్డి స్వయంగా వెళుతున్నారు. పార్టీ పటిష్టతకు సీనియర్ల అండ చాలా అవసరమని రేవంత్ చెప్పడం […]

Written By:
  • NARESH
  • , Updated On : July 4, 2021 / 10:41 AM IST
    Follow us on

    తీవ్రమైన పోటీ మధ్య పీసీసీ చీఫ్ పోస్టు దక్కించుకున్న రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే అసంతృప్తులు, ఆరోపణలు ఎక్కువ. ముఖ్యంగా పార్టీలోని సీనియర్లను కలుపుకోకపోతే అసలుకే ఎసరు ఏర్పడే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో రేవంత్ రెడ్డి ముందుగానే అలాంటి పరిస్థితి ఏర్పడకుండా రోజువారీగా సీనియర్ నాయకులను కలుస్తున్నారు. అవసరమైతే కొందరి నాయకుల ఇంటికి రేవంత్ రెడ్డి స్వయంగా వెళుతున్నారు. పార్టీ పటిష్టతకు సీనియర్ల అండ చాలా అవసరమని రేవంత్ చెప్పడం విశేషం.

    తాజాగా ఆయన పార్టీ సీనియర్ నాయకురాలు రేణుకా చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మీడియాతో పలు ఆసక్తి విషయాలను చెప్పారు. పార్టీలో ఎంతో మంది సీనియర్ నాయకులు ఉండగా అధిష్టానం తనకు పీసీసీ చీఫ్ బాధ్యతలు అప్పజెప్పిందన్నారు. అయితే ఎవరెలా ఉన్నా అందరినీ కలుపుకొని పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని అన్నారు. ఇక కాంగ్రెస్ ను వీడిన సీనియర్ నాయకులతో మాట్లాడుతానని, ఘర్ వాపసీ ప్రొగ్రాంను త్వరలో అమలు చేస్తానని రేవంత్ రెడ్డి చెప్పారు.

    వాస్తవానికి అధిష్టానం వద్దకు రేవంత్ రెడ్డిక పీసీసీ చీఫ్ పోస్టు ఇవ్వొద్దని ఎన్నో అభ్యర్థనలు వచ్చాయి. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో దూకుడుగా వ్యవహరించే రేవంత్ రెడ్డితోనే పార్టీ మనుగడ సాధ్యమవుతుందని చాలా మంది సీనియర్ నేతలు చెప్పారు. అయితే కొందరు టీడీపీ నుంచి వచ్చిన వారికి చీఫ్ పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కానీ ఓవరాల్ గా ఢిల్లీ పెద్దలు రేవంత్ కే అవకాశం ఇచ్చారు.

    ఈ నేపథ్యంతో సీనియర్ల మాట జవదాటకుండా నడుచుకుంటానని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇక ఆయన పీసీపీ చీఫ్ అని ప్రకటన వెలువడగానే అధికార టీఆర్ఎస్ పై దూకుడు పెంచారు. అదే తరుణంతో కాంగ్రెస్ పార్టీ జెండాతో గెలిచి టీఆర్ఎస్ లోకి వెళ్లిన వారిని రాళ్లతో కొట్టండి అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేయడంపై తీవ్రంగా చర్చ జరగుతోంది. దీంతో కొందరిని రేవంత్ రెడ్డి తీసుకువస్తారా..? అన్న చర్చ కూడా సాగుతోంది.