Homeఎంటర్టైన్మెంట్Rajinikanth Kamal Haasan movie cameo roles: రజినీకాంత్ - కమల్ హాసన్ మూవీలో క్యామియో...

Rajinikanth Kamal Haasan movie cameo roles: రజినీకాంత్ – కమల్ హాసన్ మూవీలో క్యామియో రోల్స్ లో నటిస్తున్న పాన్ ఇండియా స్టార్ హీరోలు..

Rajinikanth Kamal Haasan movie cameo roles: సౌత్ సినిమా ఇండస్ట్రీలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి ప్రత్యేకమైన స్థానం ఉంది. ఒకప్పుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ సైతం తమిళ్ ఇండస్ట్రీలో భాగంగా ఉండేది. కానీ సీనియర్ ఎన్టీఆర్, నాగేశ్వరరావు లాంటి నటులు తమిళ్ ఇండస్ట్రీలో ఉన్న హీరోలు, దర్శకులతో మనకు సెట్ అవడం లేదని మద్రాసు నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీని హైదరాబాద్ కి తీసుకొచ్చారు… ఇక ఆ తర్వాత ఇక్కడ మన హీరోలు మన సినిమాలను చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. చిరంజీవి బాలకృష్ణ వెంకటేష్ నాగార్జున ఇక్కడ టాప్ హీరోలుగా ఎదిగారు. కానీ తమిళంలో మాత్రం రజనీకాంత్, కమల్ హాసన్ లు అక్కడ టాప్ హీరోలుగా మారారు. ఇక తమిళ ప్రేక్షకులు వాళ్ళిద్దరూ కాంబినేషన్ లో సినిమా వస్తే చూడాలని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే ఇప్పుడు వాళ్ళిద్దరిని ఒకే ఫ్రేమ్ లో చూపించడానికి దర్శకుడు నెల్సన్ ప్రయత్నం చేస్తున్నాడు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన అనౌన్స్ మెంట్ వీడియో వచ్చింది. అది చాలా అద్భుతంగా ఉండడంతో ప్రేక్షకుల్లో ఒక అటెన్షన్ క్రియేట్ అయింది. మొత్తానికైతే ఈ సినిమాతో రజినీకాంత్, కమల్ హాసన్ ఇద్దరు ఏదో ఒక వండర్ ని క్రియేట్ చేయబోతున్నారనే విషయం చాలా స్పష్టంగా తెలుస్తుంది.

Also Read: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ ను పట్టించుకోని దర్శకులు..కానీ అనిల్ రావిపూడి అలా కాదు..

అయితే ఈ సినిమాలో తమిళ్ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఇద్దరు స్టార్ హీరోలు క్యామియో రోల్స్ పోషించబోతున్నట్టుగా తెలుస్తుంది. అందులో ఒకరు ధనుష్ కాగా, మరొకరు సూర్య కావడం విశేషం… వీళ్ళిద్దరు రజనీకాంత్, కమల్ హాసన్ మీద ఉన్న అభిమానంతోనే ఈ సినిమాలోకి చేయడానికి ఒప్పుకున్నారట… ప్రస్తుతం నెల్సన్ ‘జైలర్స్ 2’ సినిమాని తెరకెక్కిస్తున్నాడు.

ఈ సినిమా ఆగస్టులో రిలీజ్ అవ్వనున్న నేపథ్యం లో ఈ సినిమా ముగిసిన తర్వాత రజనీకాంత్, కమల్ హాసన్ సినిమా మీద పూర్తి ఫోకస్ ని పెట్టబోతున్నట్టుగా తెలుస్తుంది…ఇక ఈ సినిమాలో హీరో ఎవరు, విలన్ ఎవరు అనేదాని మీదనే సందిగ్ధ పరిస్థితి నెలకొంది. వీళ్ళిద్దరిలో ఎవరు హీరోగా చేసినా, ఎవరు విలన్ గా చేసిన ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ బజ్ క్రియేట్ అవుతుంది. ఇక ఫైనల్ గా ఈ సినిమా సక్సెస్ ని సాధిస్తుందా? లేదా అనేది కీలకమైన అంశంగా మారింది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version