India vs West Indies rain forecast: టీ20 వరల్డ్ కప్ సిరీస్‌లో ఆదివారం హై ఓల్టేజీ మ్యాచ్ జరుగనుంది. ఇందుకు కోల్‌కతా ఈడెన్‌గార్డెన్ వేదిక కాబోతోంది. భారత్–వెస్టిండీస్ మధ్య క్వార్టర్ ఫైనల్ జరగనుంది. ఇందులో గెలిచే జట్టు సెమీఫైనల్‌కు చేరుకుంటుంది. భారత్‌కు నెట్ రన్ రేట్ తక్కువగా ఉండంతో వర్షం వల్ల మ్యాచ్ రౖద్దయితే టోర్నీ నుంచి నిష్క్రమిస్తుంది. దీంతో మ్యాచ్‌కు వర్షం ఆటంకం కలిగిస్తుందా అని అభిమానులు ఆరా తీస్తున్నారు.
వాతావరణ శాఖ అభయం..
భారత్–వెస్టిండీస్ మ్యాచ్‌కు వర్షం ముప్పు లేదని వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశం స్పష్టంగా కనిపిస్తోంది. మేఘాలు ఆవరించే అవకాశం లేదు. వాతావరణం మ్యాచ్‌కు అనుకూలంగా ఉంటుందని స్పష్టం చేసింది. దీంతో ఫ్యాన్స్ ఆసక్తి పెరిగింది. క్లియర్ స్కైతో పూర్తి మ్యాచ్ ఆడే అవకాశాలు బలంగా ఉన్నాయి.
Also Read: వస్తోంది బారాముల్లా ఎక్స్‌ప్రెస్.. క్రికెట్‌లోకి దూసుకొచ్చిన పేస్ స్టార్!
అభిమానులు వాతావరణ అప్‌డేట్‌లపై టెన్షన్‌లో ఉండటం సహజం. కానీ అధికారుల స్పష్టతతో కలవరం తగ్గింది. ఆదివారం స్టేడియంలో ప్యాక్డ్ హౌస్, థ్రిల్లింగ్ కాన్‌టెస్ట్ ఖాయం. భారత్ వికెట్‌లో గెలిచి సెమీస్‌కు చేరుతుందా లేదా అనేది చూడాలి.