ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ప్రస్తుతం రక్తసంబంధీకులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. దీంతో అన్నదమ్ముల హల్ చల్ కొనసాగుతోంది. టీడీపీ నుంచి బాబాయ్, అమ్మాయ్ అచ్చెన్నాయుడు, ఆదిరెడ్డి భవానీ ఎమ్మెల్యేలుగా ఉన్నారు. జగన్, జగన్ మేనమామ రవీంద్రనాథ్ రెడ్డి సైతం శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అదోని ఎమ్మెల్యే వై.సాయిప్రసాద్ రెడ్డి, గుంతకల్ ఎమ్మెల్యే వై. వెంకట్రామారెడ్డి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి ముగ్గురూ అన్నదమ్ములే. వీరిలో సాయిప్రసాద్ రెడ్డి పెద్దవాడు. సాయిప్రసాద్, బాల నాగిరెడ్డి సీనియర్ ఎమ్మెల్యేలు కాగా వెంకట్రామారెడ్డి తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. సాయిప్రసాద్ మూడు సార్లు అసెంబ్లీకి పోటీ చేసి రెండుసార్లు గెలిచారు.
ఈ ముగ్గురు అన్నదమ్ముల మరో సోదరుడు శివరామిరెడ్డి ఉరవకొండ నుంచి ఓ సారి ఎమ్మెల్యేగా గెలవడంతో మరోసారి ఎమ్మెల్యే అయి విప్ గా పనిచేశారు. వీరి తండ్రి భీంరెడ్డి కూడా ఎమ్మెల్యేగా పని చేశారు. ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, నలుగురు అన్నదమ్ములు ఎమ్మెల్యేలు అయిన చరిత్ర దేశ చరిత్రలోనే ఏ కుటుంబానికి లేదు. ఇలా అరుదైన ఘనత బాలనాగిరెడ్డి కుటుంబానికే దక్కింది. బాలనాగిరెడ్డి మూడోసారి ఎమ్మెల్యే అయ్యారు.
వాస్తవంగా చూస్తే సినాయార్టీ పరంగా ఆయనే కేబినెట్ రేసులో ముందు ఉ:టారు. అయితే ఈసారి మాత్రం మనకు కచ్చితంగా మంత్రి పదవి ఉండాల్సిందే.
మంత్రి పదవి రేసులో బాల నాగిరెడ్డి, సాయి ప్రసాద్ రెడ్డి ఇద్దరిలో సాయిప్రసాద్ పెద్దవాడు కావడంతో ముందు ఆప్షన్ గా ఆయన్నే పెట్టాలని నిర్ణయించుకున్నారు.
జగన్ కు ఈ ముగ్గురు అన్నదమ్ములంటే ఇష్టమే. వీరు వివాదాలకు దూరంగా ఉండడంతో సహజంగానే వీరి మీద అభిమానమే ఉంటుంది. మిగిలిన ఇద్దరు కూడా కర్నూలు జిల్లా నుంచే ఎమ్మెల్యేలుగా ఉన్నారు. బుగ్గనను తప్పించి బాలనాగిరెడ్డి సోదరుల్లో ఎవరికి అయినా పదవి ఇస్తారా? అన్నది సందేహమే. ఒక వేళ జయరాంను తప్పించి బగ్గనను కొనసాగించినా మంత్రి పదవులు రెడ్లకే ఇవ్వాలి. మంత్రి పదవుల విషయంలో ఈ సోదరులు అవగాహనకు వచ్చినా జగన్ ఎవరికి మద్దతు ఇస్తారో వేచి చూడాల్సిందే.