Homeఎంటర్టైన్మెంట్Directors ignoring Kalyan Ram: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ ను పట్టించుకోని దర్శకులు..కానీ అనిల్...

Directors ignoring Kalyan Ram: ఆ విషయంలో కళ్యాణ్ రామ్ ను పట్టించుకోని దర్శకులు..కానీ అనిల్ రావిపూడి అలా కాదు..

Directors ignoring Kalyan Ram: సినిమా ఇండస్ట్రీ లో ఏ రోజు ఎవరు టాప్ పొజిషన్లో ఉంటారో ఎవరు పాతాళానికి పడిపోతారో ఎవ్వరు చెప్పలేరు. సినిమా ఇండస్ట్రీ ఒక జూదం లాంటిది. ఇక్కడ హీరోగా సక్సెస్ అవ్వడం అనేది అంత తేలికైన విషయమైతే కాదు. ఇక్కడ కష్టపడే తత్వం తో పాటు టాలెంట్ ఉండాలి ఇక వీటితో పాటు అంతో ఇంతో లక్ ఉండాలి. అలా ఉన్నవారు మాత్రమే ఇక్కడ రాణిస్తారు. సక్సెసుల వెనకాల మనం పరుగెత్తడం కాదు. సక్సెస్ లను మన వెనకల వచ్చేలా చేసుకోవాలి. అలాంటప్పుడే ఇండస్ట్రీలో మనకు రెడ్ కార్పెట్ పరిచి మరి ప్రతి ఒక్కరు మనల్ని ఆహ్వానిస్తూ ఉంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు, దర్శకులు తమదైన రీతిలో సత్తా చాటుతూ ముందుకు సాగుతున్నారు… ఇక్కడ ఎన్ని ప్రయత్నాలు చేసిన మొదట మనల్ని నమ్మి సినిమా అవకాశం ఇచ్చే ప్రొడ్యూసర్లు చాలా తక్కువ మంది ఉంటారు. అలాగే హీరోలు సైతం తమ కెరీర్ ని రిస్క్ లో పెట్టి మొదటి ఛాన్స్ ఇవ్వాలి అంటే కొంతవరకు ఆలోచిస్తూ ఉంటారు.

ఇక ఇలాంటి నేపథ్యంలోనే నందమూరి కళ్యాణ్ రామ్ మాత్రం ప్రొడ్యూసర్ గా మారి చాలామంది దర్శకులకు అవకాశాన్నిచ్చాడు. ముఖ్యంగా సురేందర్ రెడ్డి చెప్పిన కథ నచ్చి ‘అతనొక్కడే’ సినిమాతో తనను దర్శకుడి గా మార్చాడు. ఇక ఈ సినిమాతో సక్సెస్ ను సాధించిన కూడా ఈ కాంబోలో మరో సినిమా రాలేదు. ఇక సురేందర్ రెడ్డి రవితేజ తో చేసిన ‘కిక్ 2’ సినిమాకి కళ్యాణ్ రామ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించినప్పటికి ఆ సినిమా డిజాస్టర్ అయింది.

Also Read: పవిత్రమైన తిరుమలలో యూట్యూబర్ గీతూ రాయల్, తన స్నేహితులతో చేసిన ఘోర పాపం..వీడియో వైరల్!

దాంతో అతనికి భారీగా నష్టాలైతే వచ్చాయి. ఆ తర్వాత ‘పటాస్’ సినిమాతో అనిల్ రావిపూడిని దర్శకుడిగా పరిచయం చేశాడు. ఆ సినిమా కూడా సూపర్ సక్సెస్ అయింది. అయినప్పటికి వీళ్ళ కాంబోలో ఇప్పటివరకు మరో సినిమా చేయలేదు. కానీ ఎట్టకేలకు ఇప్పుడు అనిల్ వెంకటేష్ తో చేస్తున్న సినిమాలో కళ్యాణ్ రామ్ ను మరొక హీరోగా సెలెక్ట్ చేసుకున్నాడు. మొత్తానికైతే కళ్యాణ్ రామ్ తనకు మొదటి అవకాశం ఇచ్చినందుకు తనమీద కృతజ్ఞతా భావాన్ని చూపిస్తూ ఆయనతో మరో సినిమా చేస్తుండడం అనేది నిజంగా చాలా గొప్ప విషయమనే చెప్పాలి.

ప్రస్తుతం కళ్యాణ్ రామ్ తో అనిల్ సినిమా చేయడం వల్ల మరోసారి తనకి మంచి మార్కెట్ ఏర్పుతుంది. ఈ మధ్య కాలం లో కళ్యాణ్ రామ్ ఆర్థికంగా కూడా చాలా వరకు నష్టపోయినట్టుగా తెలుస్తుంది. ఒక సక్సెస్ వస్తే మరిన్ని మంచి సినిమాలు చేసుకునే అవకాశాలైతే దక్కుతాయి. కాబట్టి అనిల్ రావిపూడి అతనితో సినిమాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version