Revanth Reddy: పార్టీ గెలిస్తే తొలి సంత‌కం దాని మీదే అంటున్న రేవంత్‌.. కాంగ్రెస్‌లో అగ్గి రాజుకుంటుందా..?

Revanth Reddy: రాజకీయాల్లో అన్ని పార్టీలు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ కు ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఎవరు సీఎం అవుతారనేది ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అనాదిగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు ఎవరూ స్వతంత్రంగా హామీలు ఇచ్చింది లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో హామీలు ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు. ఏం చెప్పాలన్నా ఢిల్లీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే వెల్లడించాలి […]

Written By: Mallesh, Updated On : February 28, 2022 5:34 pm
Follow us on

Revanth Reddy: రాజకీయాల్లో అన్ని పార్టీలు వేరు కాంగ్రెస్ పార్టీ వేరు. కాంగ్రెస్ కు ఒక రాష్ట్రంలో ఎన్నికలు వస్తే ఎవరు సీఎం అవుతారనేది ఫలితాలు వచ్చిన తర్వాతే తెలుస్తుంది. అనాదిగా ఇదే సంప్రదాయం కొనసాగుతోంది. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటివరకు ఎవరూ స్వతంత్రంగా హామీలు ఇచ్చింది లేదు. వైయస్ రాజశేఖర్ రెడ్డి తర్వాత ఆ స్థాయిలో హామీలు ఇచ్చే ధైర్యం ఎవరూ చేయలేదు.

Revanth Reddy

ఏం చెప్పాలన్నా ఢిల్లీ అధిష్టానం నుంచి వచ్చిన ఆదేశాలను మాత్రమే వెల్లడించాలి తప్ప అంతకుమించి ఎవరికివారు మాట్లాడేది ఉండదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి మాత్రం ఎన్నికలకు ముందే హామీలు ఇచ్చేస్తున్నారు. పైగా అక్కడికి ఏదో తానే సీఎం అయిపోతాను అన్నట్టు వరాలు గుప్పిస్తున్నారు. కాంగ్రెస్ గెలిస్తే తొలి సంతకం ప్రగతి భవన్ ను అంబేడ్క‌ర్ నాలెడ్జ్ సెంటర్ గా మార్చడానికి పెడతామంటూ చెబుతున్నారు. గెలిచిన ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామ‌ని కూడా హామీ ఇస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు దమ్ముంటే ముందస్తు ఎన్నికలకు రావాలంటూ సవాల్ విసురుతున్నారు.

Also Read:  వంగవీటి జిల్లా లొల్లి మళ్లీ మొదలైంది

యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ భవన్ లో నిర్వహించిన నిరసన దీక్షలో రేవంత్ పై విధంగా మాట్లాడాడు. ఇప్పటికే సీనియర్లు నానా రాద్ధాంతం చేస్తున్నారు. రేవంత్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని, తమకు ఏమాత్రం గౌరవం ఇవ్వడం లేదని, త‌మ‌ను ప‌క్క‌న పెట్టేస్తున్నాడ‌ని, ఏది చేసినా త‌మ‌కు చెప్ప‌ట్లేద‌ని ఢిల్లీ అధిష్టానానికి కంప్లైంట్లు చేస్తున్నారు. మొన్నటికి మొన్న జగ్గారెడ్డి ఎంత పెద్ద ర‌చ్చ చేశాడో చూశాం.

TPCC Chief Revanth Reddy

మరి ఇలాంటి పరిస్థితుల్లో కూడా రేవంత్ స్వతంత్రంగా హామీలు ఇవ్వడాన్ని బట్టి చూస్తుంటే ఎవరిని లెక్క చేయట్లేదు అనే విషయం అర్థమవుతుంది అంటున్నారు రాజకీయ నిపుణులు. కాంగ్రెస్ లో ఎప్పటినుంచో ఉన్న సీనియర్లు సైతం ఇప్పటివరకు ఇలాంటి హామీలు ఇవ్వలేదు. కానీ టీడీపీ నుంచి వచ్చిన రేవంత్ రెడ్డి పార్టీ పగ్గాలు తీసుకోవడమే కాకుండా పార్టీ సీనియర్లను పక్కన పెట్టేసి రాజకీయాలు చేస్తున్నారని అంటున్నారు.

పార్టీని గెలిపించడం కోసమే ఇదంతా చేస్తున్నానని రేవంత్ చెప్పుకోవచ్చు. కానీ గతంలో ఉన్న టీపీసీసీ అధ్యక్షులు ఎవరూ కూడా ఇలా స్వతంత్రంగా హామీలు ఇవ్వలేదు. పైగా వారి హయాంలో సీనియర్లు ఇంతలా గుస్సా కాలేదు. మొత్తానికి రేవంత్‌ చేస్తున్న పనులు చూస్తుంటే పార్టీలో మరింత అగ్గి రాజుకోవడం ఖాయమని తెలుస్తోంది.

Also Read:  మంచు విష్ణు ఆఫీస్ లో చోరీ.. ఇంతకీ ‘మా’కు విష్ణు చేస్తోందేమిటి ?

Tags