Bigg Boss Nagarjuna Remuneration: బిగ్ బాస్.. ఈ షోకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. అన్ని షో లు వేరు బిగ్ బాస్ షో వేరు. ఎందుకంటే బిగ్ బాస్ అంటేనే కాంట్రవర్సీలకు పెట్టింది పేరు. కంటెస్టెంట్స్ మధ్య గొడవలు, కొట్టుకోవాడాలు, తిట్టుకోవడాలు లాంటివి ఉంటాయి. బయట ఎలా ఉన్నా సరే ఈ షో లోకి అడుగు పెట్టిన వారిపై చాలాసార్లు విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఇక ఈ షోకు హోస్టింగ్ చేయడం అనేది కత్తి మీద సాము అనే చెప్పుకోవాలి. ఎందుకంటే కంటెస్టెంట్స్ మధ్యలో గొడవలు పెడుతూనే తమ మీద నెగిటివ్ కామెంట్లు రాకుండా చేసుకోవడం చాలా పెద్ద సవాల్. ఇంకా చెప్పాలంటే ఒత్తిడితో కూడుకున్నది. అందుకే ఈ షో నుంచి ఎన్టీఆర్, నాని తప్పుకున్నారనే వార్తలు కూడా ఉన్నాయి. ఇక మూడో సీజన్ నుంచి హోస్టు గా చేస్తున్న నాగార్జున సక్సెస్ ఫుల్ గా రాణిస్తున్నారు. అసలు ఆయన నాలుగో సీజన్ నుంచి కనిపించరని చాలామంది అన్నారు.
Also Read: భీమ్లానాయక్ కలెక్షన్ల వర్షం: ఈ వారంలో అన్ని కోట్ల టార్గెట్ ఖతం..
కానీ అలాంటి రూమర్లకు చెక్ పెడు తో నాగార్జున ఐదో సీజన్ దాకా హోస్టుగా రాణించారు. ఇప్పుడు ఓటీటీలో 24 గంటలు అలరించబోతున్నబిగ్ బాస్ కొత్త సీజన్ కు కూడా నాగార్జుననే హోస్ట్ గా చేయనున్నారు. అయితే ఆయన రెమ్యూనరేషన్ గతం కంటే ఈ సారి తక్కువగా ఉందని తెలుస్తోంది. టెలివిజన్ లో బిగ్ బాస్ ప్రసారం అయినప్పుడు ఆయన దాదాపు రూ.10 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకునే వారు. కానీ ఇప్పుడు బిజినెస్ పరంగా చూసుకుని ఆయనకు రూ.8 నుంచి రూ.9 కోట్ల దాకా ఇస్తున్నారని సమాచారం. గతంతో పోలిస్తే ఇది తక్కువే.

అయితే టెలివిజన్ లో బిగ్ బాస్ వచ్చినప్పుడు జరిగే బిజినెస్ కంటే ఓటీటీ లో బిజినెస్ తక్కువ జరుగుతోందని తెలుస్తోంది. కాగా గతంలో బిగ్ బాస్ షోలో పాల్గొన్న వారు కూడా కొత్త సీజన్ లో ఉన్నారు. పాతవారిని ఛాలెంజర్స్ గా కొత్తవారిని వారియర్స్ గా నిర్ణయించి వారి మధ్యలో పోటీ పెడుతున్నట్టు తెలుస్తోంది. గతంలో వచ్చిన సరయు, మహేష్ విట్టా, అషు రెడ్డి, అరియానా, శ్రీ రాపాక, తేజస్వి, నటరాజ్ మాస్టర్, ఆర్ జే చైతు, హమీద, స్రవంతి, యాంకర్ శివ తదితరులు పాల్గొన్నారు. మరి 24 గంటలు ప్రసారమయ్యే బిగ్ బాస్ ఈసారి ఎంతగా అలరిస్తుందో చూడాలి.
Also Read: టాలీవుడ్ ప్రజెంట్ క్రేజీ మూవీ అప్ డేట్స్