https://oktelugu.com/

Mega Power Star Ram Charan: మరో క్రేజీ అప్ డేట్.. కొరటాల సినిమాలో చరణ్ ?

Mega Power Star Ram Charan:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా మూడేళ్ళ పాటు డేట్లు అన్ని ఆ సినిమాకే ఇచ్చేశాడు. మధ్యలో ఆచార్యలో గెస్ట్ రోల్ లో నటించినా అది కేవలం నాలుగు నిమిషాల పాత్ర మాత్రమే. అయితే, చరణ్ మొత్తానికి మూడేళ్ళ తర్వాత ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల నుంచి బయటకు వచ్చి.. శంకర్ తో మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : February 28, 2022 / 05:55 PM IST
    Follow us on

    Mega Power Star Ram Charan:  మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కారణంగా మూడేళ్ళ పాటు డేట్లు అన్ని ఆ సినిమాకే ఇచ్చేశాడు. మధ్యలో ఆచార్యలో గెస్ట్ రోల్ లో నటించినా అది కేవలం నాలుగు నిమిషాల పాత్ర మాత్రమే. అయితే, చరణ్ మొత్తానికి మూడేళ్ళ తర్వాత ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాల నుంచి బయటకు వచ్చి.. శంకర్ తో మరో సినిమాకు సిద్ధం అయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా చేయాలని చరణ్ ప్లాన్ చేస్తున్నాడట.

    Ram Charan

    అయితే, కొత్తగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. చరణ్ కొరటాల శివ దర్శకత్వంలో కూడా హీరోగా ఒక సినిమా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఇక కొరటాల త్వరలోనే తన పూర్తి ఫోకస్ ను ఎన్టీఆర్ హీరోగా చేయబోతున్న తారక్ 30వ సినిమా పై పెట్టబోతున్నాడు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ పాత్రలో మొదట చరణ్ నే అనుకున్నాడట.

    Also Read: కొత్త జిల్లాలతో ప్రయోజనాలుండేనా..జ‌గ‌న్ స‌ర్కార్‌పై భారం త‌ప్ప‌దా..?

    అప్పట్లో చరణ్ – కొరటాల సినిమా అంటూ ఒక రూమర్ బాగా వినిపించింది. మొత్తానికి చరణ్ పాత్రలో ఎన్టీఆర్ వచ్చి చేరాడు. ఇక ఈ సినిమాలో ఎన్టీఆర్ కి విలన్ గా హిందీ స్టార్ హీరో సంజయ్ దత్ నటించబోతున్నాడని అన్నారు. అలాగే విలన్ కి రైట్ హ్యాండ్ లా కమెడియన్ సునీల్ కూడా వెరీ వైలెంట్ రోల్ కనిపించబోతున్నాడని వినిపించింది.

    Mega Powerstar Ramcharan

    విలన్ పాత్రల కోసం సునీల్ ఈ మధ్య బాగా తాపత్రయం పడుతున్నాడు. సునీల్ కి కొరటాల కి మధ్య మంచి స్నేహం ఉంది. అందుకే కొరటాల, సునీల్ విలన్ గా తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి ఓ అవకాశం ఇస్తున్నాడట.

    Also Read: పుకార్లకు రాధేశ్యామ్ చెక్.. ప్రభాస్ టీమ్ కొత్త ప్లాన్ !

    Tags