Regional Ring Road: రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తోంది. కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణంలో భాగంగా పలు రాష్ట్రాల్లో రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయిస్తోంది. ఈనేపథ్యంలో హైదరాబాద్ లోని రీజినల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి నిధులు కేటాయించింది. దీంతో రింగు రోడ్డు నిర్మాణం ప్రారంభానికి చర్యలు తీసుకోవడంతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది.
రింగు రోడ్డు ఉత్తర భాగానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. దీంతో హైదరాబాద్ చుట్టూ నాలుగు జిల్లాల్లో 15 మండలాల్లో 113 గ్రామాల మీదుగా రింగు రోడ్డు వెళ్తోంది. దీనికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. భూసేకరణకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఏ గ్రామంలో ఎంత మేర భూమి అవసరమవుతుందో అంచనాలు తయారు చేస్తున్నారు.
ఇందుకు గాను 1904 హెక్టార్ల భూమి అవసరమవుతుందని తేల్చారు. భూ యజమానులకు నోటీసులు జారీ చేశారు. నష్టపోతున్న భూమికి పరిహారం ఇప్పించేందుకు సిద్ధమవుతున్నారు. దీనికి గాను గెజిట్ (3ఏ) విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రంగు రోడ్డు పనులకు పచ్చజెండా ఊపినట్లు సమాచారం.
కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. ఈ మేరకు తెలంగాణలో కూడా రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించింది. దీని కోసమే కసరత్తు ప్రారంభించింది. పనులు చేయడానికి ముందుకొచ్చింది. రాష్ట్రప్రభుత్వ అభాండాలు వేస్తున్నా తన పని తాను చేసుకుపోతోంది. ఇప్పటికే ఉన్న ఔటర్ రింగు రోడ్డుతోపాటు రీజినల్ రింగు రోడ్డుతో నగరం చుట్టు దగ్గర దారి ఏర్పడనుందని తెలుస్తోంది.
భారీ ప్రాజెక్టుకు పచ్చజెండా ఊపడంతో హైదరాబాద్ నగరం చుట్టూ కేంద్రం కూడా మరో రింగు రోడ్డు నిర్మాణానికి కేంద్రం తీసుకున్న నిర్ణయంతో జిల్లాల మధ్య దూరం మరింత తగ్గనుంది. ఔటర్ రింగు రోడ్డుతో ఇప్పటికే నగరం చుట్టూ దూరభారం తగ్గడంతో ఇప్పుడు కేంద్రం కూడా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేసి తెలంగాణ ప్రజలకు మరింత ఉత్సాహాన్ని పెంచనుందని తెలుస్తోంది.