Pakistan Balochistan crisis బలూచిస్తాన్.. పాకిస్తాన్‌లో అతిపెద్ద రాష్ట్రం. 49 శాతం భూభాగం కలిగి ఉన్న ఈ రాష్ట్రంలో అరుదైన క్రిటికల్ మినరల్స్, బంగారం నిల్వలు ఉన్నాయి. అయితే ఇక్కడి వనరులను అమ్ముకుంటున్న పాకిస్తాన్ ప్రభుత్వం ఇక్కడి ప్రజలకు సౌకర్యాలు కల్పించడం లేదు. జీవన ప్రమాణాలు మెరుగుపర‍్చడం లేదు. దీంతో దశాబ్దాలుగా బలూచ్ ప్రజలు పాలకులపై తిరుగుబాటు చేస్తున్నారు. స్వాతంత్య్రం కోరుకుంటున్నారు. బలూచ్ లిబరేసన్ ఆర్మీ, ఆత్మాహుతి దళం పాకిస్తాన్ ఆర్మీ, ప్రభుత్వం ఆస్తులపై దాడులు చేస్తోంది. జాఫర్ ఎక్స్‌ప్రెస్‌పై పలుమార్లు దాడి చేసింది. బలూచ్ తిరుగుబాటును ఇంతకాలం నియంత్రించలేకపోయిన పాకిస్తాన్.. తాజాగా అక్కడి ప్రజలపై దౌర‍్జన్యాలకు పాల్పడుతోంది. తాజాగా వారి ఉపాధిని దెబ్బకొట్టింది. ఇంధన వ్యాపారాన్ని ధ్వంసం చేసింది.
ఇంధనం కాల్చివేత..
గ్వాదర్ మోచెన్ కప్పర్, కుంటాని ప్రాంతాల్లో బలూచ్ స్థానికులు ఇంధన వ్యాపారంపై జీవిస్తున్నారు. ప్రభుత్వ సంస్థలు దీనిని నేరపరమైనదిగా చూపి కాల్చివేశాయి. బలూచ్ యజ్జెహీ కమిటీ ఈ దాడిని ఖండించి ప్రజల ఆర్థిక హక్కుల ఉల్లంఘనగా పేర్కొంది. దశాబ్దాలుగా బలూచిస్తాన్ సహజ వనరులను లూటీ చేస్తూ అభివృద్ధి నిర్లక్ష్యం చేస్తున్న ఇస్లామాబాద్ విధానాలు కొనసాగుతున్నాయి. సరిహద్దు వ్యాపారాలు, చిన్న ఉద్యోగాలను నిషేధించడం ద్వారా స్థానికులను పేదరికంలోకి నెట్టుతున్నారు. ఇది రాజకీయ, సామాజిక మినహాయింపును తీవ్రతరం చేస్తోంది.
మానవహక్కుల డిమాండ్లు
అంతర్జాతీయ సంస్థలు పాకిస్తాన్‌పై ఒత్తిడి పెంచాలని కోరుతున్నాయి. బలూచ్ ప్రాంతంలో ప్రాథమిక సదుపాయాలు, ఉపాధి అవకాశాలు కల్పించాలి. ఈ దాడులు మానవ హక్కుల ఉల్లంఘనలకు దారితీస్తూ ప్రాంతీయ తిరుగుబాటును రెచ్చగొడుతున్నాయి.
బలూచ్ సమాజం పోరాటాన్ని కొనసాగిస్తుంది. షెహబాజ్ ప్రభుత్వ చర్యలు స్థానికులను మరింత దూరం చేస్తున్నాయి. ఐక్యంగా ఉండి హక్కుల కోసం డిమాండ్ చేయడమే పరిష్కార మార్గం. మరోవైపు బీఎల్‌ఏ దాడులు మరింత పెంచే ప్రమాదం ఉంది.