Devi Sri Prasad Mythri Movie Makers issue: ఒక సినిమా సక్సెస్ ని సాధించాలి అంటే ఆ సినిమా దర్శకుడితో పాటు మిగిలిన అన్ని క్రాఫ్ట్ ల వాళ్ళు సినిమా మీద జాగ్రత్తగా వర్క్ చేసి ది బెస్ట్ అవుట్ పుట్ ను ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఇలాంటి క్రమంలోనే ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే మ్యూజిక్ కూడా కీలక పాత్ర వహిస్తుంది. కొన్ని సినిమాల కథలు బాలేకపోయిన సినిమా అస్సలు ప్రేక్షకుడిని మెప్పించకపోయిన కూడా ఆయా సినిమాలు సాంగ్స్ వల్ల అంతో ఇంతో కలెక్షన్స్ ని రాబట్టిన సందర్భాలు ఉన్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే గత 25 సంవత్సరాల నుంచి దేవిశ్రీప్రసాద్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలైతే అందిస్తున్నాడు.
అలాంటిది ఈ మధ్యకాలంలో ఆయనకు అంత పెద్దగా కలిసి రావడం లేదు. ‘పుష్ప 2’ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నప్పటికి ఆయనకి మైత్రి మూవీ మేకర్స్ వాళ్లతో ఏదో ఇష్యూ జరిగింది. దాని వల్లే అతన్ని ప్రతి సినిమాకి ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నారు… పుష్ప 2 సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ తనే అయినప్పటి బ్యాగ్రౌండ్ స్కోర్ విషయంలో మాత్రం శ్యామ్ సి ఎస్ తో కొట్టించారు…
ఆ తర్వాత అజిత్ హీరోగా మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ సినిమాకి సైతం దేవి శ్రీ ప్రసాద్ ను పీకేసి జీవి ప్రకాష్ కుమార్ ను పెట్టారు… ఇక రీసెంట్ గా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకి సైతం బ్యా గ్రౌండ్ర్ విషయంలో దేవిశ్రీప్రసాద్ ని తీసేసి తమన్ చేత కొట్టించడం పట్ల దేవీ సైతం కొంతవరకు అసహనాన్ని వ్యక్తం చేస్తున్నాడు.
ఎందుకని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు మాత్రమే దేవిశ్రీ ప్రసాద్ ను పక్కన పెట్టాలని చూస్తున్నారు. వాళ్లకి అతనికి ఏమైనా గొడవ జరిగిందా? అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి…ప్రస్తుతం దేవిశ్రీప్రసాద్ సైతం ‘ఎల్లమ్మ’ సినిమాతో హీరోగా మారుతున్నాడు. కాబట్టి ఆయన కూడా ఈ విషయం మీద పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. లేకపోతే మాత్రం ఆయన కూడా చాలా ఫైర్ అయ్యేవాడు అంటూ మరికొంతమంది కామెంట్స్ చేస్తున్నారు…