Atrocities In Tiruvallur District: మొదటి భార్యతో గొడవలు వస్తే ఎవరైనా ఏం చేస్తారు.. విడాకులు తీసుకుని రెండో పెండ్లి చేసుకుంటారు. కానీ ఇప్పుడు చెప్పబోయే కథలో వ్యక్తి మాత్రం మొదటి భార్యకు విడాకులు ఇవ్వకుండా.. రెండో పెండ్లి చేసుకున్నాడు. అలాగని మొదటి భార్యను వదిలేయలేదు. ఇద్దరితో ఒకే ఇంట్లో కాపురం పెట్టి నాలుగేండ్లు కలిసి ఉన్నాడు. అయితే మొదటి భార్యతో మళ్లీ గొడవలు రావడంతో ఆమె నుంచి దూరంగా ఉంటూ.. రెండో భార్యతోనే సెటిల్ అయిపోయాడు. ఏమైందో ఏమో గానీ.. రెండోభార్యతో కలిసి సూసైడ్ చేసుకున్నాడు.

ఈ ఘటన తమిళనాడులోని తిరువళ్లూరు జిల్లాలో కలకలం రేపింది. ఈ జిల్లాలోని కడంబత్తూరు యూనియన్ ఏరియాలో వడివేలు (42) అనే వ్యక్తి జీవిస్తున్నాడు. ఇతనికి మొదటి భార్యతో విభేదాలు రావడంతో.. 14 ఏండ్లి కిందట రేవతి (33)ని రెండో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు పూజా (13) అనే కూతురు ఉంది. రెండో పెండ్లి అయిన మొదటి నాలుగేండ్లు మొదటి భార్య, రెండో భార్యతో కలిసి ఒకే ఇంట్లో ఉన్న వడివేలు.. ఆ తర్వాత మాత్రం రెండో భార్యతో వేరే ఇంట్లో ఉంటున్నాడు.
Also Read: YCP Leader: మహిళానేతపై అలాంటి కామెంట్ చేసిన వైసీపీ నేత.. ఇంత దారుణమా..?
వడివేలు ఓ కంపెనీలో నైట్ సెక్యూరిటీ గార్డుగా జాబ్ చేస్తున్నాడు. అతని భార్య రేవతి ఇంట్లోనే ఉంటుంది. కూతురు పూజా దగ్గరిలోని స్కూల్ లో ఏడో తరగతి చదువుతోంది. వీరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. పైగా రేవతి బర్త్ డే రోజున వడివేలు కొత్త బైక్ కూడా కొన్నాడు. ఇలా అందరూ కలిసి హాయిగా జీవిస్తున్నారు.

ఒకరోజు వడివేలు డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లాడు. ఉదయం బాగానే ఉన్నాడు. రోజూ మాదిరిగానే కూతురు పూజ స్కూల్‌కు వెళ్లింది. తిరిగి వచ్చే సరికి తల్లిదండ్రులు ఇద్దరూ ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని కనిపించారు. ఇంకేముంది పూజా మైండ్ బ్లాంక్ అయిపోయింది. తల్లిదండ్రులు ఇద్దరూ సడెన్ గా ఇలా చేయడంతో బాధలో మునిగిపోయింది. ఆమె కేకలేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు.
అయితే అన్యోన్యంగా జీవిస్తున్న దంపతులు ఇలా సడెన్ గా ఎందుకు ఉరి వేసుకున్నారో ఇంకా తెలియలేదు. తమ ఇంట్లో ఎలాంటి గొడవలు లేవని పూజా చెబుతోంది. ఇక ఈ జంట ఆత్మహత్యలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
Also Read: Ashoka Vanam lo Arjuna Kalyanam: అశోకవనంలో అర్జున కళ్యాణం.. పాట వచ్చేసింది
[…] […]