Iran Israel war : మధ్య ప్రాశ్చంలో అమెరికా అధ్యక్షుడు అగ్ని రాజేశాడు. ఇది పది రోజులుగా ఇరాన్‌తోపాటు గల్ఫ్ దేశాలను దహిస్తోంది. యుద్ధం మొదలైన తొలిరోజే అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ సుప్రీం లీడర్‌ను మట్టుబెట్టాయి. దీంతో ఇరాన్ రెండో రోజు నుంచి ప్రతీకార దాడులు తీవ్రం చేసింది. అమెరికాకు మద్దతుగా ఉన్న గల్ఫ్‌దేశాలు, ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. దీంతో గల్ఫ్ దేశాలు ఇబ్బంది పడుతున్నాయి.
ఆర్థికంగా బలపడిన గల్ఫ్ దేశాలు..
చమురు ఆధారిత ఆదాయాలకుతోడు పర్యాటకం, సాంకేతికత, పెట్టుబడుల వైపు మలిచిన గల్ఫ్ దేశాలు ప్రపంచయి ఆర్థిక కేంద్రాలుగా ఎదిగాయి. ఇది ట్రంప్‌కు నచ్చడం లేదు. క్రమంగా ఇవి అమెరికా ఆధిపత్యానికి సవాలుగా మారుతున్నాయి. భవిష్యత్‌లో తమను మించిపోయతాయని భావించిన ట్రంప్ గల్ఫ్ దేశాలను ఆర్థికంగా దెబ్బతీయాలని ఇరాన్ యుద్ధం పేరుతో గల్ఫ్ దేశాలను ఆర్థికంగా దెబ్బతీస్తున్నట్లు తెలుస్తోంది.
ఇరాన్ ను రెచ్చగొట్టి..
ఇజ్రాయెల్‌తో కలిసి ఇరాన్ మీద దాడులు చేయించి, దానిని రెచ్చగొడటం ద్వారా గల్ఫ్ ప్రాంతంలో ముసలం పుట్టించాడు ట్రంప్. దీంతో ఇప్పుడు ఇరాన్ పొరుగున ఉన్న గల్ఫ్ దేశాలపై తీవ్రమైన దాడులు చేస్తోంది. సారి చెబుతూనే గల్ఫ్‌దేశాల చమురు కేంద్రాలను టార్గెట్ చేస్తోంది. మరోవైపు ట్రంప్ యుద్ధం ఇప్పటల్లో ముగియదని, నాలుగైదు వారాలు కొనసాగుతుందని ప్రకటించడం ద్వారా పరోక్షంగా గల్ఫ్ స్థిరత్వాన్ని దెబ్బతీసే వ్యూహం ఉంది. ఇరాన్ గల్ఫ్ దేశాలపై వైమానిక దాడులు చేస్తున్నా అమెరికా స్పందించడం లేదు. గల్ఫ్ దేశాల రక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. ఇజ్రాయెల్ కోసం మాత్రమే రక్షణ వ్యవస్థలు ఏర్పాటు చేస్తోంది. గల్ఫ్ దేశాల రక్షణను ట్రంప్ గాలికి వదిలేసినట్లు తెలుస్తోంది.
ట్రంప్ ఆర్థిక యుద్ధం..
గల్ఫ్ చమురు ఉత్పత్తి ఆగితే ప్రపంచ మార్కెట్లు కుప్పకూలి, పెట్టుబడులు పాశ్చాత్య దేశాలకు ఇబ్బందిగా మారతాయి. ఇది గల్ఫ్ దేశాలను మళ్లీ రక్షణకు ఆధారపడేలా మారుస్తుంది. ట్రంప్ విదేశాంగ విధానం ఇలాంటి ఆర్థిక ఒత్తిడిని ప్రధాన ఆయుధంగా వాడుతున్నట్లు కనిపిస్తుంది.