Prince Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ ఇండియా సినిమా చేయడానికి త్రివిక్రమ్ ప్రస్తుతం కిందామీదా పడుతున్నాడు. రీసెంట్ గానే త్రివిక్రమ్ ఈ సినిమా స్క్రిప్ట్ ను పూర్తి చేశాడు. రాజకీయ నేపథ్యంలో సాగే భారీ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాని తీయాలనేదే త్రివిక్రమ్ ఆశ, తాపత్రయం. కానీ, త్రివిక్రమ్ కి పక్కా యాక్షన్ మూవీ వర్కౌట్ అవదు అనేది మహేష్ భయం.
అందుకే మహేష్, ఫుల్ యాక్షన్ కి నో అన్నారు. కాకపోతే, త్రివిక్రమ్ మాత్రం ఈ సినిమాలో యాక్షన్ అండ్ రాజకీయాలతో పాటు ఓ సామాజిక అంశాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తామని, ఇది యాక్షన్ సినిమా అయినప్పటికీ.. ఎమోషనల్ గా బాగా కనెక్ట్ అవుతుందని చెబుతున్నాడు. పైగా ఈ సినిమాలో రెండు బలమైన నేపథ్యాలు కూడా ఉంటాయట.
ఢిల్లీలోని భిన్నమైన రాజకీయ నేపథ్యం ఒకటి కాగా, పలనాటి ప్రాంతానికి సంబంధించిన నేపథ్యం మరొకటి. మరి మహేష్ ఒప్పుకుంటాడా ? ఎలాగూ మాటలతో కన్విన్స్ చేయడం త్రివిక్రమ్ కి పెన్ తో పెట్టిన విద్య. మరి ఈ మాటల మాంత్రికుడు ఈసారి తన విద్యను ఎంతవరకు ప్రయోగిస్తాడో చూడాలి. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాశాడు.
సంజయ్ ది పక్కా రాజకీయ నాయకుడి పాత్ర. అలాగే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటించబోతున్నారు. అందులో ఒక హీరోయిన్ ను బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ ను తీసుకోవాలని చూస్తున్నట్లు త్రివిక్రమ్ సన్నిహితుల దగ్గర నుండి అందుతున్న సమాచారం. మరో కథానాయికగా పూజా హెగ్డేనే తీసుకోవాలని త్రివిక్రమ్ ఆశ పడుతున్న వ్యవహారం గురించి తెలిసిందే.
Also Read: Andhra Pradesh: యథా జగన్.. తథా ఐఏఎస్.. ఏపీలో ఏంటీ పాలన..?
ఏది ఏమైనా త్రివిక్రమ్ పై నిర్మాతలకు నమ్మకం ఎక్కువ. పైగా మహేష్ బాబు హీరో అంటే.. ఇక ఆ సినిమాకు ఎంతైనా ఖర్చు పెట్టడానికి వెనుకాడరు. ప్రస్తుతం పెద్ద హీరోల సినిమాకు రూ. 200 కోట్లు మినిమం బడ్జెట్ అయిపోయింది. ఎలాగూ మహేష్ రెమ్యునరేషన్ రూ. 60 కోట్లు వరకు ఉంటుంది. మరోపక్క అల వైకుంఠపురములో.., భీమ్లా నాయక్ తో త్రివిక్రమ్ కూడా తన రెమ్యునరేషన్ ను పెంచేశాడు. ఈ లెక్కన సినిమాకి రూ.250 కోట్లు కనీస బడ్జెట్ అయ్యేలా ఉంది.
అసలుకే యాక్షన్ సినిమా.. త్రివిక్రమ్ కి సరిగ్గా సూట్ కానీ జోనర్. అందుకే, ఈ సినిమా బడ్జెట్ చూసి మహేషే ఆలోచనలో పడ్డాడు. మహేష్ బ్యానర్ కూడా ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అవుతుంది. అందుకే, బడ్జెట్ గురించి మహేష్ వెనకాముందు ఆలోచిస్తున్నాడు. ఫైనల్ గా త్రివిక్రమ్ – మహేష్ లలో ఎవరు కాంప్రమైజ్ అవుతారో చూడాలి.
Also Read: Governor Invites KCR: కేసీఆర్‌కు గవర్నర్ ఆహ్వానం.. ఈ ఛాన్స్‌ను వినియోగించుకుంటారా…?