ఆరంజ్ జోన్లలో కూడా ర్యాపిడ్ టెస్టులు!

తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతలల్లోనే కాకుండా తక్కువగా ఉన్న ఆరెంజ్ జోన్ జిల్లాల్లో కూడా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించే విధంగా కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు తెలంగాణలోని నల్గొండ, జనగామ, వికారాబాద్‌ ను ఎంచుకున్నారు. ఈ మేరకు ఐసీఎంఆర్ అధికారులు నేడు రాష్ట్రానికి వచ్చారు. నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 549 మందిని పరీక్షించగా 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 7:03 pm
Follow us on


తెలంగాణలో కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రెడ్ జోన్ ప్రాంతలల్లోనే కాకుండా తక్కువగా ఉన్న ఆరెంజ్ జోన్ జిల్లాల్లో కూడా ర్యాపిడ్ టెస్టులు నిర్వహించే విధంగా కేంద్ర సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలకు తెలంగాణలోని నల్గొండ, జనగామ, వికారాబాద్‌ ను ఎంచుకున్నారు. ఈ మేరకు ఐసీఎంఆర్ అధికారులు నేడు రాష్ట్రానికి వచ్చారు.

నల్గొండ జిల్లాలో ఇప్పటి వరకు 549 మందిని పరీక్షించగా 15 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ అని తేలింది. ఈ పరిణామాల మధ్య జిల్లాలో మరిన్ని పరీక్షలు నిర్వహించబోతున్నారు. ఈ ర్యాపిడ్ టెస్టులో భాగంగా ఒక్కో క్లస్టర్ నుంచి 400ల నమూనాలను సేకరిస్తారు. అనంతరం 3 నెలల పాటు ప్రతి నెల 400 మంది నమూనాలను పరీక్షిస్తారు. కరోనా వ్యాప్తిని అరికట్టాలంటే ఎప్పటికప్పుడు టెస్టులు చేయడం ఒక్కటే ఏకైన మార్గమని కేంద్రం భావిస్తోంది.