మనవరాలితో టేబుల్ టెన్నిస్ ఆడిన మంత్రి

దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కడివారక్కడే గప్ చుప్ అయ్యారు. రాజు, పేద తేడా లేకుండా ప్రతీఒక్కరు ఇళ్లకే పరిమితయ్యారు. కొందరు సెలబ్రెటీలు రకరకాల ఛాలెంజ్ లతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరమే తమకు దొరికిన ఈ సమయానికి ఫ్యామిలీకి కేటాయిస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులంతా తమ శాఖల అధికారులతో […]

Written By: Neelambaram, Updated On : April 25, 2020 7:11 pm
Follow us on


దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో ఎక్కడివారక్కడే గప్ చుప్ అయ్యారు. రాజు, పేద తేడా లేకుండా ప్రతీఒక్కరు ఇళ్లకే పరిమితయ్యారు. కొందరు సెలబ్రెటీలు రకరకాల ఛాలెంజ్ లతో కాలక్షేపం చేస్తున్నారు. మరికొందరమే తమకు దొరికిన ఈ సమయానికి ఫ్యామిలీకి కేటాయిస్తూ తమ అనుభవాలను సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్నారు. ఇదిలా ఉండగా కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో రాజకీయ నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలందిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మంత్రులంతా తమ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఈనేపథ్యంలో వారికి దొరికిన కొద్దిపాటి సమయాన్ని ఫ్యామిలీతో గడిపేందుకు మెగ్గుచూపుతున్నారు.

నిత్యం ప్రజా సేవలో బీజీగా ఉండే తెలంగాణ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తన మనువరాలు తన్వీతో టెబుల్ టెన్నీస్ ఆడి సేదతీరారు. ఈమేరకు ఆయన స్పందిస్తూ సాధారణంగా తనకు ఫ్యామిలీతో గడిపేందుకు తీరిక దొరకదని పేర్కొన్నారు. లాక్డౌన్ సమయంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు చెప్పారు. తనకు దొరికిన కొద్దిపాటి సమయాన్ని తన మనువరాలతో కాలక్షేపం చేస్తున్నట్లు చెప్పారు. ఈమేరకు తన మనవరాలు తన్వీతో కలిసి టేబుల్ టెన్నిస్ ఆడుతున్నట్లు తెలిపారు. తెలంగాణలో లాక్డౌన్ సడలించే వరకు ప్రజలంతా ఇళ్లకే పరిమితం కావాలని సూచించారు. ఎవరూ బయటి రావొద్దని కుటుంబ సభ్యులతో సమయాన్ని గడుపాలని మంత్రి ఎర్రబెల్లి కోరారు. కాగా మంత్రి తన మనవరాలితో టెబుల్ టెన్నిస్ ఆడుతున్న పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.