https://oktelugu.com/

పత్రికపై రామోజీరావు సంచలన నిర్ణయం.. మీడియా వర్గాల షాక్

గతేడాది కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. వ్యాపార, వాణిజ్యం పరంగానే కాదు.. ఉద్యోగ, ఉపాధి పరంగానూ పెద్ద ఎత్తున దెబ్బతీసింది. ఇప్పటికి ఇంకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. అటు మీడియాపైనే కరోనా ప్రభావం చాలావరకు చూపింది. చాలా వరకు పేపర్లు తమ స్టాఫ్‌ను తగ్గించుకున్నాయి. ప్రింటింగ్‌ ఖర్చును భరించలేక సర్క్యులేషన్‌ను సైతం తగ్గించుకున్నాయి. పేపర్లను కూడా తగ్గించేశాయి. Also Read: ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకే నష్టం తేనుందా..! పాఠకులు ఆసక్తి చూపకపోవడం.. ముద్రణ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 3, 2021 / 01:15 PM IST
    Follow us on


    గతేడాది కరోనా ప్రపంచాన్ని గడగడలాడించింది. వ్యాపార, వాణిజ్యం పరంగానే కాదు.. ఉద్యోగ, ఉపాధి పరంగానూ పెద్ద ఎత్తున దెబ్బతీసింది. ఇప్పటికి ఇంకా ఆ చేదు జ్ఞాపకాల నుంచి ప్రజలు ఇంకా కోలుకోలేకపోతున్నారు. అటు మీడియాపైనే కరోనా ప్రభావం చాలావరకు చూపింది. చాలా వరకు పేపర్లు తమ స్టాఫ్‌ను తగ్గించుకున్నాయి. ప్రింటింగ్‌ ఖర్చును భరించలేక సర్క్యులేషన్‌ను సైతం తగ్గించుకున్నాయి. పేపర్లను కూడా తగ్గించేశాయి.

    Also Read: ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకే నష్టం తేనుందా..!

    పాఠకులు ఆసక్తి చూపకపోవడం.. ముద్రణ వ్యయం పెరిగిపోవడం.. ప్రకటనలు రాకపోవడంతో.. ఇలా అనేక కారణాలతో పత్రికలను నడపటం తలకు మించిన భారమైంది. దీంతో పెద్ద పెద్ద పత్రికలే ఉద్యోగాల్లో, పేజీల సంఖ్యలో కోత విధించాయి. తప్పనిసరి పరిస్థితుల్లో చాలా దినపత్రికలు పేజీల సంఖ్యను గణనీయంగా తగ్గించాయి. స్పెషల్ పేజీల జోలికి వెళ్లడం లేదు.

    కోవిడ్ ప్రభావం నేపథ్యంలో రామోజీరావు కీలక నిర్ణయం తీసుకున్నారు. రామోజీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడుస్తున్న నాలుగు మాస పత్రికలను మూసివేస్తున్నట్లు ప్రకటించింది. విపుల, చతుర, తెలుగు వెలుగు, బాలభారతం ఇక నుంచి కనిపించబోవని తెలిపింది. పాఠకుల అభిరుచి ఊహించని రీతిలో మారిపోవడానికి.. కరోనా కల్లోలం తోడు కావడంతో ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రామోజీ ఫౌండేషన్ వెల్లడించింది. 1978లో విపుల, చతురలను ప్రారంభించారు. ప్రపంచవ్యాప్తంగా అనువదించిన కథలను తెలుగు పాఠకులకు అందించే ఉద్దేశంతో విపుల మాస పత్రికను ప్రారంభించగా.. ఇప్పటి వరకూ 8 వేల వరకు కథలను ప్రచురించారు. చతురలో 518కిపైగా నవలలను పబ్లిష్‌ చేశారు.

    Also Read: షర్మిల అనుంగ శిష్యుడికి రేవంత్ రెడ్డి బ్యాచ్ బెదిరింపులు?

    తెలుగు భాషకు, సాహిత్యానికి సేవ చేసే ఉద్దేశంతో 2012 సెప్టెంబర్‌లో తెలుగు వెలుగును ప్రారంభించారు. పిల్లలకు మాతృభాష పట్ల ఆసక్తి పెంచడం.. వినోదం, విలువలను అందించే ఉద్దేశంతో 2013 జూన్‌లో బాలభారతం ప్రారంభించారు. అన్ని వర్గాల వారికీ అందుబాటులో ఉంచాలన్న ఉద్దేశంతో.. నష్టాలు వస్తున్నా ఖాతరు చేయకుండా ఈ నాలుగు మాస పత్రికలను నామమాత్రపు ధరకే అందించామని.. కానీ నష్టాలు భరించలేని స్థితికి చేరడంతో.. గత్యంతరం లేని పరిస్థితుల్లో ఏప్రిల్ నెల నుంచి నిలిపివేస్తున్నామని రామోజీ ఫౌండేషన్ ప్రకటించింది. దీంతో ఆ మాస పత్రికల అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్