https://oktelugu.com/

ఆపరేషన్‌ ఆకర్ష్‌ బీజేపీకే నష్టం తేనుందా..!

పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో మమత బెనర్జీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకు అన్నిరకాల ఎత్తులు వేస్తోంది. మొత్తం బీజేపీ పెద్దల ఫోకస్‌ అంతా కూడా ఇక్కడే పెట్టారు. అందుకే.. ఈ మధ్య ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టి భారీ ఎత్తున తన పార్టీలో చేర్చుకుంది. నయానో భయానో పార్టీలో చేర్చుకున్న బీజేపీకి చివరికి తాము ఎంత తప్పు చేశామా అని మదనపడుతోందట. Also Read: బెంగాల్‌ ఫలితాలపైనే భవిష్యత్‌ […]

Written By:
  • Srinivas
  • , Updated On : March 3, 2021 12:54 pm
    Follow us on

    BJP
    పశ్చిమ బెంగాల్‌లో పాగా వేయడమే లక్ష్యంగా బీజేపీ ముందుకు దూసుకెళ్తోంది. ఈ ఎన్నికల్లో మమత బెనర్జీని దెబ్బతీయడమే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకు అన్నిరకాల ఎత్తులు వేస్తోంది. మొత్తం బీజేపీ పెద్దల ఫోకస్‌ అంతా కూడా ఇక్కడే పెట్టారు. అందుకే.. ఈ మధ్య ఆపరేషన్‌ ఆకర్ష్‌ చేపట్టి భారీ ఎత్తున తన పార్టీలో చేర్చుకుంది. నయానో భయానో పార్టీలో చేర్చుకున్న బీజేపీకి చివరికి తాము ఎంత తప్పు చేశామా అని మదనపడుతోందట.

    Also Read: బెంగాల్‌ ఫలితాలపైనే భవిష్యత్‌ రాజకీయాలు

    ఇప్పుడు బీజేపీలో ఎక్కడ చూసినా తృణమూల్ నేతలే కనిపిస్తున్నారు. బీజేపీ నేతలు ఎవరూ కనిపించడం లేదు. ఎన్నికలకు ముందు కూడా బీజేపీలో చేరడానికి తృణమూల్ ఎమ్మెల్యేలను మమతా బెనర్జీ తోసేస్తున్నారు. ఆమె సిట్టింగ్ ఎమ్మెల్యేల్లో అత్యధికులకు టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నారు. 294 స్థానాల్లో తృణమూల్‌కు 211 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరిలో కొంత మంది బీజేపీలో చేరిపోయారు. కనీసం 150 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు నిరాకరించాలని మమతా బెనర్జీ నిర్ణయించారు.

    ఈ మేరకు కొత్త వాళ్ల ఎంపిక కూడా పూర్తయింది. తమకు టిక్కెట్లు ఇవ్వరని భావిస్తున్న ఎమ్మెల్యేలు అందరూ బీజేపీ వైపు చూస్తున్నారు. ఇప్పటికే అక్కడ తొలి విడత ఎన్నికల నోటిఫికేషన్ రాబోతోంది. అయితే ఎమ్మెల్యేలకు టిక్కెట్ల నిరాకరణ అంశాన్ని మమతా బెనర్జీ నేరుగా చెప్పడం లేదు. దీంతో అనుమానం ఉన్న వారు బీజేపీలో చేరిపోతున్నారు. ఈ చేరిపోయే నేతల గురించి మమతా బెనర్జీ ఎలాంటి కేర్ తీసుకోవడం లేదు. పోయేవాళ్లు పోవాలని సలహా ఇస్తున్నారు. వచ్చిన వాళ్లను వచ్చినట్లుగా చేర్చుకుంటున్నారు బీజేపీ నేతలు. దీంతో ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అంతా తృణమూల్‌గా మారిపోయిందన్న చర్చ జరుగుతోంది.

    Also Read: అమ్మాయితో రాష్ట్రమంత్రి సెక్స్ వీడియో.. వైరల్

    తృణమూల్ పార్టీ ఇప్పుడు ఫ్రెష్ ఫేస్‌లతో సరికొత్తగా కనిపిస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు అత్యధికులు బీజేపీ తరపున నిలబడటంతో వారిపై ఉన్న వ్యతిరేకత అంతా బీజేపీకే వెళ్తుందని తృణమూల్ ఆశిస్తోంది. మెజార్టీ కొత్త అభ్యర్థులతో తమ పార్టీకి ప్లస్ అవుతుందని నమ్ముతోంది. దీదీని బలహీనపర్చాలని ఆ పార్టీ నేతల్ని చేర్చుకుంటే వ్యూహాత్మకంగా మమతా బెనర్జీ.. బీజేపీని మరో తృణమూల్ బీ టీంగా మార్చేశారు. ఇప్పుడు ఈ ముద్రను చెరిపేసుకునే టైం కూడా బీజేపీకి లేకుండా పోయింది. వారి మీద ఉన్న వ్యతిరేకత పార్టీకి కూడా మైనస్‌ అయ్యే ప్రమాదమే ఉంది.

    మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్