https://oktelugu.com/

రాహులే ప్రధాని.. దీపిక ప్రశంసలు.. అందుకే ఈ కష్టాలా?

సినిమా వాళ్లు సినిమా పనిచేసుకుంటే అందరికీ చూడడానికి బాగుంటుంది. అదే వారు రాజకీయంలోకి అడుగుపెడితే తేడా కొడుతుంది. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. తెలుగు నాట రాజకీయాల్లోకి అడుగిడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. అభిమానులంతా పార్టీల పరంగా విడిపోవడంతో సినీ తారలను రాజకీయాల్లో ఆదరించలేకపోతున్నారు. ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా తన మానాన తను సినిమాలు చేసుకోకుండా బాలీవుడ్ అగ్రహీరో అప్పట్లో దేశ ప్రధాని రాహుల్ కావాలని ఆకాంక్షించారు. […]

Written By:
  • NARESH
  • , Updated On : September 28, 2020 / 06:10 PM IST
    Follow us on

    సినిమా వాళ్లు సినిమా పనిచేసుకుంటే అందరికీ చూడడానికి బాగుంటుంది. అదే వారు రాజకీయంలోకి అడుగుపెడితే తేడా కొడుతుంది. ఇప్పుడు దేశంలో అదే జరుగుతోంది. తెలుగు నాట రాజకీయాల్లోకి అడుగిడిన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు చుక్కెదురైన సంగతి తెలిసిందే. అభిమానులంతా పార్టీల పరంగా విడిపోవడంతో సినీ తారలను రాజకీయాల్లో ఆదరించలేకపోతున్నారు.

    ఈ క్రమంలోనే బాలీవుడ్ లో కూడా తన మానాన తను సినిమాలు చేసుకోకుండా బాలీవుడ్ అగ్రహీరో అప్పట్లో దేశ ప్రధాని రాహుల్ కావాలని ఆకాంక్షించారు. పరోక్షంగా ప్రధానిగా మోడీ అనర్హుడన్నట్టు వివరించారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై దీపిక ప్రశంసలు కురిపించిన ఆ వీడియో ఒకటి తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీపిక డ్రగ్స్ కేసు విచారణ శనివారం ముగిసినప్పటి నుంచి ఈ వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో భవిష్యత్ లో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యే అవకాశాలు నిండుగా ఉన్నాయని.. తనకు ఇష్టమైన నేతల్లో రాహుల్ గాంధీ ముందుంటారని దీపిక చెప్పుకొచ్చింది.

    Also Read : ఆకట్టుకుంటున్న మామాకోడళ్ల ముచ్చట్లు ! 

    కట్ చేస్తే.. తాజాగా బాలీవుడ్ డ్రగ్స్ కేసు బయటపడింది. అందులో కొందరితో కలిసి పార్టీలకు హాజరైన పాపానికి పాపం దీపిక పదుకొనేను అధికారులు విచారణ జరిపారు. నిజానికి బాలీవుడ్ స్టార్ హీరోలు ఎందరో ఈ పార్టీలకు.. డ్రగ్స్ కు అలవాటు పడి వాడారు. కానీ వారందరినీ పిలవకుండా కేవలం దీపిక పదుకొనేనే పిలవడం విశేషం. దీనికి కారణంగా పాత వీడియోను చూపిస్తూ నెటిజన్లు దెప్పి పొడుస్తున్నారు. రాహుల్ ప్రధాని కావాలని దీపిక అన్నదని.. అందుకే ఇప్పుడు అనుభవిస్తోందని ప్రచారం చేస్తున్నారు.ఇక ఢిల్లీ జేఎన్యూ అల్లర్లకు సైతం దీపిక మద్దతునివ్వడం బీజేపీ పుండు మీద కారం చల్లినట్టైందని పలువురు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఇవన్నీ పరిణామాలే దీపికను కష్టాల పాలు చేస్తున్నాయని అంటున్నారు.

    స్టార్ హీరోయిన్ దీపిక పదుకొనే కు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అందులో ఏముందంటే.. ‘అసలైన దేశభక్తి తనకు రాహుల్ లోనే కనిపిస్తుందని.. యువతకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారని’ ఆ వీడియోలో దీపిక వ్యక్తం చేసింది. మంచి నాయకుడికి రాహుల్ సరైన ఉదాహరణ అని.. రాహుల్ ప్రధానమంత్రి అవుతారనే నమ్మకం తనకు ఉందన్నారు.

    సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత వెలుగులోకి వచ్చిన ఈ డ్రగ్స్ కేసులో ఎన్.సీ.బీ అధికారులు విచారణను వేగవంతం చేస్తున్నారు. ఇటీవలే పలువురు హీరోయిన్లను విచారించారు. దీపిక కూడా విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఈ విచారణలో దీపిక కన్నీళ్లు పెట్టుకొని గుక్కపట్టి ఏడ్చేసిన విషయం తెలిసిందే.

    Also Read : హేమంత్‌ హత్య కేసులో ట్విస్ట్.. పెరుగుతున్న నిందితులు