https://oktelugu.com/

బెల్లంకొండ ‘అల్లుడు అదుర్స్’ షూటింగ్‌లో జాయిన్ అయిన సోనుసూద్‌

రాక్ష‌సుడు’ చిత్రంతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్, ‘కందిరీగ’ ఫేమ్ డైరెక్ట‌ర్‌ సంతోష్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సుమంత్ మూవీ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం పునఃప్రారంభ‌మైంది. చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోన్న సోను సూద్‌ సోమ‌వారం షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది. Also Read : పూరికి మహేశ్‌ […]

Written By:
  • admin
  • , Updated On : September 28, 2020 / 06:07 PM IST
    Follow us on

    రాక్ష‌సుడు’ చిత్రంతో సూప‌ర్ హిట్ సాధించిన యంగ్ హీరో బెల్లంకొండ శ్రీ‌నివాస్, ‘కందిరీగ’ ఫేమ్ డైరెక్ట‌ర్‌ సంతోష్ శ్రీ‌నివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతోన్న చిత్రం ‘అల్లుడు అదుర్స్‌’. సుమంత్ మూవీ ప్రొడక్ష‌న్స్ బ్యాన‌ర్‌పై సుబ్ర‌హ్మ‌ణ్యం గొర్రెల నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ కొద్ది రోజుల క్రితం పునఃప్రారంభ‌మైంది. చిత్రంలో ఓ కీల‌క పాత్ర పోషిస్తోన్న సోను సూద్‌ సోమ‌వారం షూటింగ్‌లో జాయిన్ అయ్యారు. రామోజీ ఫిల్మ్‌సిటీలో ప్ర‌స్తుతం చివ‌రి షెడ్యూల్ జ‌రుగుతోంది.

    Also Read : పూరికి మహేశ్‌ సర్ ప్రైజ్.. పూరి ఫెవరేట్‌ డైరెక్టరంట..

    బెల్లంకొండ సాయిశ్రీ‌నివాస్‌, ప్ర‌కాష్ రాజ్, సోను సూద్‌, న‌భా న‌టేష్‌, బ్ర‌హ్మాజీ, శ్రీ‌నివాస‌రెడ్డి, స‌త్య‌, కాదంబ‌రి కిర‌ణ్‌, చ‌మ్మ‌క్ చంద్ర‌, దువ్వాసి మోహ‌న్ త‌దిత‌రుల‌పై స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. ఈ భారీ తారాగ‌ణాన్ని బ‌ట్టి ఇది పూర్తి స్థాయి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని అర్థ‌మ‌వుతోంది.

    ‘అల్లుడు అదుర్స్’ టైటిల్‌కూ, ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌కూ అన్ని వైపుల నుంచీ అద్భుత‌మైన రెస్పాన్స్ వ‌చ్చింద‌ని నిర్మాత తెలిపారు. త్వ‌ర‌లో టీజ‌ర్‌ను రిలీజ్ చేస్తామ‌నీ, 2021 సంక్రాంతి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా చిత్రాన్ని విడుద‌ల చేయ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామ‌నీ ఆయ‌న చెప్పారు.

    ఈ చిత్రంలో బెల్లంకొండ శ్రీ‌నివాస్ స‌ర‌స‌న నాయిక‌లుగా న‌భా న‌టేష్‌, అను ఇమ్మాన్యుయేల్ న‌టిస్తున్నారు. ప్ర‌కాష్ రాజ్‌, సోను సూద్ కీల‌క పాత్ర‌ధారులైన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ‌ప్ర‌సాద్ సంగీతం స‌మ‌కూరుస్తుండ‌గా, చోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫ‌ర్‌గా ప‌నిచేస్తున్నారు.

    Also Read : బ్రేకింగ్ : భక్తుడితో పవన్ కొత్త సినిమా !