https://oktelugu.com/

మరో బాంబు పేల్చిన రఘురామా? ఆ మగ్గురు జైలుకేనట?

  వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్టంరాజు మరోసారి బాంబ్‌ పేల్చారు. వైసీపీ నుంచే గెలుపొందిన ఆయన జగన్ ను.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కొద్దిరోజులుగా కాక రేపుతున్నారు. జగన్ సర్కార్ వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. దీంతో జగన్‌ కూడా ఆ ఎంపీని పెద్దగా ఖాతరు చేయడం లేదు. అప్పటి నుంచి రఘురామ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా.. జగన్‌ కేసులపై […]

Written By:
  • NARESH
  • , Updated On : October 9, 2020 4:26 pm
    Follow us on

     

    వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్టంరాజు మరోసారి బాంబ్‌ పేల్చారు. వైసీపీ నుంచే గెలుపొందిన ఆయన జగన్ ను.. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ కొద్దిరోజులుగా కాక రేపుతున్నారు. జగన్ సర్కార్ వ్యతిరేకిస్తున్న అమరావతి రాజధానికి మద్దతు తెలుపుతూ తిరుగుబావుటా ఎగురవేస్తున్నారు. దీంతో జగన్‌ కూడా ఆ ఎంపీని పెద్దగా ఖాతరు చేయడం లేదు. అప్పటి నుంచి రఘురామ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. జగన్‌ను టార్గెట్‌ చేసి మాట్లాడుతూనే ఉన్నారు. తాజాగా.. జగన్‌ కేసులపై ఎంక్వైరీ నడుస్తుండడంతో మరోసారి పరోక్షంగా విమర్శలు సంధించి హాట్ కామెంట్స్ చేశారు.

    Also Read: ‘స్థానిక’ ఎన్నికలపై జగన్ సర్కార్‌ యూటర్న్.. ఎందుకు తీసుకుంది?

    వైఎస్ జగన్ కు చెందిన  జగతి పబ్లికేషన్  కేసులో ముగ్గురు ప్రముఖులు జైలుకు వెళ్లే అవకాశం ఉందంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు సంచలన వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది.  సీబీఐ దాడులపై స్పందించిన ఆయన శుక్రవారం ఢిల్లీలో మాట్లాడుతూ వైసీపీ నేతలకు మానసిక సమస్యలు ఎక్కువయ్యాయన్నారు. సీబీఐ దాడులంటూ తనపై దుష్ప్రచారం చేశారని, సాక్షి పత్రిక, టీవీపై పరువు నష్టం దావా వేస్తానని రఘురామ స్పష్టం చేశారు. దీనిపై న్యాయవాదితో సంప్రదించినట్లు చెప్పారు.

    పిచ్చివాళ్లతో ప్రభుత్వాన్ని నడిపించాలనుకోవడం మంచిది కాదని రఘురామ కృష్ణంరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు. వైవీ సుబ్బారెడ్డి అవినీతిపై ప్రధాని మోదీకి లేఖ రాశానన్నారు. రంగుల విషయంలో న్యాయస్థానాలు సీఎం జగన్ గూబ పగులగొట్టాయన్నారు. ఓట్లు కావాల్సినప్పుడు ఎస్సీ, ఎస్టీ, బీసీలు కావాలని.. గెలిచాక శిరోముండనాలు, దాడులు చేస్తున్నారని దుయ్యబట్టారు. ఏడుకొండలు.. ఏడు రెడ్లు అన్నట్లు తిరుమల తయారైందని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు.

    Also Read: ఫ్యాన్‌ గాలికి చిక్కనున్న ‘గంటా’..! విశాఖలో టీడీపీ పని అయిపోయినట్లేనా..?

    రఘురామ వ్యాఖ్యలతో ఇప్పుడు జైలుకు వెళ్లే ఆ ముగ్గురు ఎవరు చెప్మా అంటూ ప్రశ్నలు మొదలయ్యాయి.  మరి రఘురామ విమర్శల వెనక ఉన్న ఆంతర్యం ఏంటి..? జగన్‌ కేసుల విషయంలో నిజంగానే ముంపు పొంచి ఉందా..? ఆయా కేసుల్లో ఎవరెవరికి శిక్ష పడబోతోంది..? అనే ప్రశ్నలు ఇప్పుడు అంతటా వస్తున్నాయి