https://oktelugu.com/

బ్యాంకు కస్టమర్లకు ఇది గొప్ప శుభవార్త

కరోనా టైంలో కస్టమర్లకు ఇంతో అంతో ఆసరాగా నిలిచిన రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా.. వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. నగదు బదిలీకి సంబంధించి ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్టీజీఎస్‌) సేవలను 24×7 అందించనున్నట్లు తెలిపింది. వచ్చే డిసెంబర్‌‌ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంతదాస్‌ వివరాలు వెల్లడించారు. Also Read: అనిల్ అంబానీ జైలుకు పోకుండా ముఖేష్ అంబానీ సాయం చేయలేదా? ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిచేసే […]

Written By: , Updated On : October 9, 2020 / 03:32 PM IST
Follow us on

కరోనా టైంలో కస్టమర్లకు ఇంతో అంతో ఆసరాగా నిలిచిన రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా.. వినియోగదారులకు మరో శుభవార్త చెప్పింది. నగదు బదిలీకి సంబంధించి ‘రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ (ఆర్టీజీఎస్‌) సేవలను 24×7 అందించనున్నట్లు తెలిపింది. వచ్చే డిసెంబర్‌‌ నుంచి అమలు చేయనున్నట్లు చెప్పింది. ఈ మేరకు ఆర్‌‌బీఐ గవర్నర్‌‌ శక్తికాంతదాస్‌ వివరాలు వెల్లడించారు.

Also Read: అనిల్ అంబానీ జైలుకు పోకుండా ముఖేష్ అంబానీ సాయం చేయలేదా?

ప్రస్తుతం ఈ సేవలు బ్యాంకుల పనిచేసే రోజుల్లోనే అందుతున్నాయి. బ్యాంకు పనిదినాల్లో ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటలవరకు మాత్రమే సేవలు అందుబాటులో ఉన్నాయి. గత డిసెంబర్‌‌ 16 నుంచి నెఫ్ట్‌ సేవలను 24×7 అందిస్తున్నా.. ఆర్టీజీఎస్‌ సేవలను కూడా 24×7 అందించేందుకు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

నెఫ్ట్‌, ఆర్టీజీఎస్‌ అనేవి రెండు సత్వర నగదు బదిలీ సేవలు. ఆర్టీజీఎస్‌ విధానంలో కనీసం రూ.2 లక్షలు బదిలీ చేయాల్సి ఉంటుంది. బ్యాంకులను బట్టి గరిష్ఠ మొత్తం ఆధారపడి ఉంది. అదే నెఫ్ట్‌ విధానంలో కనీస పరిమితి అంటూ ఏమీ లేదు.

Also Read: బిజెపి కి తూర్పు గాలి వీస్తుంది

అంతేకాదు.. మిగితా వాటితో పోల్చుకుంటే నెఫ్ట్‌ విధానంలో నగదు బదిలీ వేగంగా జరుగుతుంది. నెఫ్ట్‌లో ప్రతి గంటకోసారి క్లియరెన్స్‌ ఉంటుంది. నగదు బదిలీ చేస్తే గంటలోపే అవతలి వారి అకౌంట్లో డబ్బులు చేరుతాయి. అమౌంట్‌ను బట్టి కొన్ని కొన్ని సందర్భాల్లో తక్కువ సమయంలోనే యాడ్‌ అవుతుండడం జరుగుతుంటుంది. అదే ఆర్టీజీఎస్‌లో మాత్రం అప్పటికప్పుడే స్పాట్‌లో లావాదేవీలు పూర్తవుతాయి. అందుకే ఇప్పుడు ఆర్టీజీఎస్ 24 గంటలు అనుమతివ్వడం బ్యాంకు వినియోగదారులకు ఊరటగా చెప్పొచ్చు.